Weather Alert: భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో నేడు ( సోమ), రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు రానున్న రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. జులై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేయాలని డిపార్ట్‌మెంట్‌ని కోరింది. ఈ నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో గణనీయమైన వర్షపాతం నమోదైంది, రాష్ట్రంలో…
Red Alert: రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు వ్యాపించని రాష్ట్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నేడు ఒడిశాలో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం.. ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని చెప్పారు.…
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలో వేడిగాలులుల తీవ్రంగా వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటలో తీవ్ర వాయుగుండంగా బలపడి "రేమాల్" తుఫాన్ గా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. "రేమాల్" తీవ్ర తుఫాన్ గా మారి ఈనెల 27వ తేదీన అర్థరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని పేర్కొనింది.
బంగాళాఖాతంలో కొనసాగుతుంది అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు తుఫాన్ గా మారితే రెమల్గా నామకరణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.