UBS : పవన్‌కు పోలీస్ క్యారెక్టర్ సెంటిమెంట్ వర్కవుటవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించిన కొమురం పులి. ఎస్జే సూర్య తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే పవన్ కళ్యాణ్ లుక్, పోలీస్ యాటిట్యూడ్ మాత్రం ఫ్యాన్స్‌కు కొత్తగా అనిపించింది. అదే పోలీస్ గెటప్‌లో కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక బిగెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ డైలాగ్స్, పవన్ స్టైల్, కామెడీ టైమింగ్ ఈ సినిమాను కల్ట్ స్టేటస్‌కు తీసుకెళ్లాయి. అందుకే చాలా మంది ఫ్యాన్స్‌కు పోలీస్ అంటే గబ్బర్ సింగ్ స్టైల్ గుర్తుకొస్తుంది.
Also Read : Bollywood : పదేళ్లుగా బ్లాక్ బస్టర్ చూడని యంగ్ హీరో.. పిలిచి అవకాశాలిస్తున్న బడా సంస్థ
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఆ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్‌గా కనిపించిన సినిమా భీమ్లా నాయక్. మలయాళ హిట్ “అయ్యప్పనుం కోషియుం” రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్, సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. మాస్ యాటిట్యూడ్, ఇంటెన్స్ క్యారెక్టర్‌తో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ పోలీస్ పాత్రలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఉగాది స్పెషల్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని హరీష్ శంకర్ తెరకెక్కించాడు. వీళ్లది గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న పవర్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే పోలీస్ క్యారెక్టర్ ఫార్ములా వర్కవుటవుతుందా? లేక గబ్బర్ సింగ్ తరహా సీన్స్ తో మళ్లీ వస్తే మొనాటనీ వస్తుందా? పవన్ పోలీస్ క్యారెక్టర్ మళ్లీ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తుందా? లేదా తెలియాలంటే ఈనెల 19 వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!