Mahesh Kumar Goud: డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం.. మరి కేటీఆర్ సిద్దమా?
- మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యపై తీవ్ర ఆందోళన
- ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి
- డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం, మరి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. గత పదేళ్లలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలు విస్తృతంగా వ్యాపించాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను డ్రగ్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువస్తానని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమా? అని మహేష్ గౌడ్ సవాల్ విసిరారు.
‘మీరు మీ నాయకుడిని డ్రగ్స్ టెస్టుకు తీసుకురండి. నేను మా సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువస్తాను’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటీవల డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్‌కు చెందిన ఒక నాయకుడు పట్టుబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రశ్నించారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు సరైన సందేశం ఇవ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉందని అన్నారు. డ్రగ్స్ సమస్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా కోరారు.
Also Read
Also Read: Harish Rao: హ్యామ్ రోడ్ల పేరిట భారీ కుంభకోణం.. ఆనాడు వద్దన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మాత్రం!
డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు బీ-ఫారమ్ ఇచ్చే ముందు డ్రగ్స్ టెస్టులు చేయాలని సూచించారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారంలో నేరుగా పాల్గొంటున్నారనే ఆరోపణలు కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. గాంధీ విగ్రహం అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీ నది పరిస్థితిపై కూడా స్పందిస్తూ.. అభివృద్ధి లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తాత్కాలికమేనని, ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్కు రెడీ..!