Meteorological Department: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలో వేడిగాలులుల తీవ్రంగా వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 28వ తేదీ వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వేడిగాలుల ప్రభావం భారీగా కనపించనుందని ప్రకటించింది. అలాగే, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది.
Read Also: Reve Party: హమ్మయ్య.. ఈసారి నన్ను వదిలేసారు.. నవదీప్ సంచలన కామెంట్స్..
ఇక, వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఢిల్లీలో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7 డిగ్రీల అధికం అని తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల బలంగా వీయనుండటంతో వెదర్ డిపార్ట్మెంట్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో రాత్రిపూట కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొనింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో వేడిగాలులు ఎక్కువగా ఉంటాయి.. వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది.. కాబట్టి ప్రజలు ఇంట్లోనే ఉండడం ఉత్తమమని భారత వాతావరణ శాఖ సూచనలు చేసింది.