వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Gujarat Rains: గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతుంది. ఇప్పటికే పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 20 మంది ప్రాణాలను విడిచారు.
Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Weather update: దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఈ రోజు (మంగళవారం) గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది.
Heavy Rain Alert: దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో ఇవాళ (శనివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.