నేడు ఒడిశాలో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం..
ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని చెప్పారు. ఇక, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బరిపాడలోని ఛౌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు బాలాసోర్‌లో.. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రపరాలో జరిగే బహిరంగ సభల్లో మోడీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించబోతున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖుషీనగర్, డియోరియా, గోరఖ్‌పూర్‌లో ప్రచారం చేయనున్నారు.
రెమాల్ తుఫాను విధ్వంసం.. మిజోరాంలో 27 మంది మృతి
ఈ ఏడాది తొలి అతిపెద్ద తుఫాను రెమాల్ ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. తుపాను మంగళవారం నాడు కనీసం 54 మంది ప్రాణాలను తీసింది. తుఫాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం సమాచార, పౌరసంబంధాల శాఖ సమాచారం ఇచ్చింది. వర్షాల తర్వాత కొండచరియలు విరిగిపడటంతో వీరంతా చనిపోయారు. మేఘాలయలో, తుఫాను ప్రభావంతో ఇద్దరు వ్యక్తులు, అస్సాంలో, రెమల్ తుఫాను కారణంగా వర్షాల కారణంగా ముగ్గురు, నాగాలాండ్‌లో ఇలాంటి సంఘటనలలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, రాష్ట్ర విపత్తు సహాయ నిధికి మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమ రూ.15 కోట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ప్రకటించిందని సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..!
తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కంపార్ట్‌మెంట్‌లు అన్నీ భక్తులతో నిండిపోయి.. నాలుగు రోజుల పాటు భక్తులు రోడ్లపై రెండు కిలో మీటర్ల మేర నిలబడ్డారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు తిరుమలలో కనిపించడం లేదు. తిరుమలలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్లుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే దర్శన టోకెన్ లేని భక్తులకు 12 గంటల దర్శన సమయం పడుతోంది.
నేడు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పటిషన్లపై విచారణ
నాంపల్లి కోర్టులో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. గతంలో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో.. మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. అంతేకాకుండా.. డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్ తో పాటు పది మంది కానిస్టేబులు, పది మంది హెడ్ కానిస్టేబుల్స్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న. ఈ క్రమంలో.. ప్రతి రోజు 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ చేశారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పని చేశారు. పిఓఎల్ 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఎస్ఓటి టాస్క్ఫోర్స్లతో కలిసి పని చేశారు తిరుపతన్న.
ఏపీలో కౌంటింగ్కు ఏర్పాట్లు.. రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా చెప్పారు. జూన్ 4వ తేదీన చేపట్టనున్న కౌటింగ్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పటిష్టం చేశారు. ఓట్లు లెక్కించేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత రిటర్నింగ్ అధికారి స్పందించాలని సీఈఓ మీనా వెల్లడించారు. పోలింగ్ ముందురోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా దాదాపు 20 కంపెనీల కేంద్ర బలగాలను ఏపీకి కేటాయించినట్లు చెప్పుకొచ్చారు.
ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వర రావు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ను కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టు లో పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో మూడు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. అధికారులు అతడిని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఉమా మహేశ్వరరావు, మరికొందరు అవినీతి అధికారులతో కలిసి అక్రమాస్తుల పేర్లు, పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉమామహేశ్వర్‌రావు టీమ్ సీసీఎస్‌లో హై ప్రొఫైల్ కేసులను మాత్రమే టార్గెట్ చేసిందని, ఉమామహేశ్వర్‌రావు పలు కేసుల్లో సెటిల్‌మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వర్ రావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
నేడు హైదరాబాద్కు చంద్రబాబు.. రేపు ఏపీకి పయనం..!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ( బుధవారం ) విదేశాల నుంచి తిరిగి వస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత మహారాష్ట్రలోని మహాలక్ష్మీ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ తర్వాత రోజే అమెరికా వెళ్లిపోయారు. అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు భాగ్యనగరానికి చేరుకోబోతున్నారు. ఆరోగ్య పరీక్షల కోసమే అమెరికాకు చంద్రబాబు వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ముంబై కోస్టల్ రోడ్ టన్నెల్ లీక్.. యాక్షన్ మోడ్ లోకి సీఎం షిండే
ముంబై తీర ప్రాంత రహదారిపై మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముంబై వాసులకు సూపర్ ఫాస్ట్ ప్రయాణాన్ని అందించే కోస్టల్ రోడ్డు లీకేజీ కారణంగా వివాదంలో ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రానీ, పోలీసులతో కలిసి ముంబై కోస్టల్ రోడ్డును పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ జాయింట్ పాయింట్ వద్ద ఉన్న లీకేజీని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని చెప్పారు. జూన్ 10న కోస్టల్ రోడ్డు రెండో లేన్‌ను కూడా ప్రారంభిస్తామని సీఎం షిండే తెలిపారు. తీరప్రాంత రహదారి మొదటి లేన్‌ను ప్రారంభించిన రెండు నెలలకే నీటి లీకేజీ కనిపించింది. ఈ లీకేజీ ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లై ఓవర్ దగ్గర ఉంది. నిరంతరాయంగా నీటి లీకేజీ కారణంగా గోడలకు వేసిన పెయింట్ కూడా రాలిపోయింది. ఈ విషయమై ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఎలాన్ మస్క్ కు నాగ్ అశ్విన్ స్పెషల్ రిక్వెస్ట్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుండి స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేసారు.
నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శిని సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం
జూన్ 1న ఒడిశాలో జరగనున్న చివరి దశ ఎన్నికలకు ముందు సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కుటేపై ఎన్నికల సంఘం (ఇసిఐ) పెద్ద చర్య తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో అనవసరంగా జోక్యం చేసుకున్నందుకు కమీషన్ ఆయనను సస్పెండ్ చేసింది. అదే సమయంలో మెడికల్ లీవ్‌లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి ఆశిష్ సింగ్ ఐజీ (సీఎం సెక్యూరిటీ)ను గురువారంలోగా మెడికల్ బోర్డు ముందు హాజరుకావాలని ఈసీ కోరింది.
1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన డిఎస్ కుటే ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత శక్తివంతమైన బ్యూరోక్రాట్‌లలో ఒకరిగా పరిగణించబడ్డారు. ఢిల్లీలోని ఒడిశా రెసిడెంట్ కమీషనర్ కార్యాలయంలో ఆయన ప్రధాన కార్యాలయాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. గురువారంలోగా క్యూటీకి ఛార్జిషీటు జారీ చేయాలని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముసాయిదా చార్జిషీట్‌ను ప్రధాన కార్యదర్శికి సమర్పించనున్నారు.