Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఆదేశాలు ఇచ్చారు.
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Tamil Nadu Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది.
Heavy Rain: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
గంగానది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న లోతైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని వలన భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీగా మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు…
వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.