Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియా టాక్‌లో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా వస్తుందంటే.. అందులో త్రివిక్రమ్ హ్యాండ్ ఉండాల్సిందే. ఎందుకంటే.. ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది మరి. కానీ, ఇప్పుడది కనిపించడం లేదనే కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో! దానికి కారణం లేకపోలేదు. జల్సా సినిమా నుంచి మొదలైన పవన్, త్రివిక్రమ్ సాన్నిహిత్యం.. ఆ తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఙాతవాసి సినిమాలు చేసేలా చేశాయి. అయితే, ఎప్పుడైతే పవన్ పాలిటిక్స్‌తో బిజీ అయ్యారో.. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఆయన సినిమాలకు సంబంధించిన వ్యవహారలన్నీ దగ్గరుండి చూస్తు వచ్చాడు.
Also Read : PEDDI : చెన్నై సూపర్ కింగ్స్ తో ‘పెద్ది’ రచ్చ రచ్చే!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అలా వచ్చిన సినిమాలే భీమ్లా నాయక్, బ్రో. అయితే, బ్రో సినిమా వరకు పవన్ ప్రతి సినిమాలోను ఇన్‌వాల్వ్ అయిన త్రివిక్రమ్.. ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటు వస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో ఆయన ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణం ఏంటా? అని ఆరా తీస్తే, త్రివిక్రమ్ కొత్త సినిమాలే అని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే.. పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పుడు, ఆయన సినిమాలకు సంబంధించిన పనులు మాత్రమే చేశాడు త్రివిక్రమ్. అందుకే 2020 నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా మాత్రమే చేశాడు. ఆ సినిమానే గుంటూరు కారం. అయితే, ఇక పై దర్శకుడిగా తన సినిమాల పై గట్టిగా ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాడు త్రివిక్రమ్. ఈ క్రమంలోనే పవన్ సినిమాల్లో ఇన్వాల్వ్ కావడం లేదట, అలాగే ఆయన సినిమా ఫంక్షన్‌లకు కూడా దూరంగా ఉంటున్నాడట. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం.. వెంకటేష్‌తో తీస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ పైనే ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇంతే తప్ప.. పవన్, త్రివిక్రమ్ మధ్య ఎలాంటి విభేధాలు లేవనేది ఇండస్ట్రీ టాక్.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!