ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం బలపడుతోంది.
నైరుతి బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీ వరకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల చివర వరకు తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్చ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా ఒక్కసారిగా కప్పు…
రానున్న రోజుల్లో వర్షాలు కురిసే సూచనలతో హైదరాబాద్‌లో ఉక్కపోత ఉష్ణోగ్రతల నుంచి విరామం కొనసాగుతోంది. రానున్న నాలుగు రోజుల పాటు నగరమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. IMD హైదరాబాద్ ప్రకారం, మే 16 నుండి 19 వరకు తెలంగాణలోని దక్షిణ , మధ్య భాగాలలో చాలా ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం అంచనా వేయబడింది, మే 17 , 18 తేదీల్లో గరిష్ట…
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) మే 17 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. IMD ప్రకారం, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉక్కపోత, వేడిగాలుల నుండి ప్రజలు త్వరలో ఉపశమనం పొందబోతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. చాలా చోట్ల ప్రజలు వేడిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉంది.. అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడి వేడిగాలులు తగ్గుతాయని పేర్కొంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి, తీవ్ర వడగాల్పుల మధ్య జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ ఒక ఉపశమనం వార్త చెప్పింది. IMD ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మారబోతున్నాయి. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు వాయువ్య భారతదేశంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈశాన్య భారతదేశంలో కూడా ఎండల బారీ నుండి ప్రజలు కూడా ఉపశమనం పొందనున్నారు. ఏప్రిల్ 27,…
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా హడలెత్తించిన ఎండలు ఇప్పుడు కొద్దిగా శాంతించాయి. వేడి గాలులు తగ్గుమొఖం పట్టాయి. రెండు, మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి.