పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారబోతుంది. ఈశాన్య దిశగా కదులుతూ 24 గంటలో తీవ్ర వాయుగుండంగా బలపడి “రేమాల్” తుఫాన్ గా ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. “రేమాల్” తీవ్ర తుఫాన్ గా మారి ఈనెల 27వ తేదీన అర్థరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందని పేర్కొనింది. “రేమాల్” తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఏపీ తీరంకు సుమారు 500 కిలో మీటర్ల దూరంలో పయనించనున్న తుఫాన్ “రేమాల్”.. ప్రధాన పోర్టులో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. తుఫాన్ ప్రభావం రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని విశాఖ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డెరైక్టర్ సునంద తెలిపారు.
Read Also: Etela Rajender: ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం అసాధ్యం..
కాగా, గంటకు 102 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తూ.. మే 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, దక్షిణ మణిపూర్‌లోని కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కూడా ఉండొచ్చు అని చెప్పుకొచ్చింది. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు మే27వ తేదీ లోగా తీరానికి రావాలని సూచించారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకూడదని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.