Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షం కురిసే సమయానికి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
Read also: Group-1 Prelims Key: నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ..
భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల పాటు గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
Arunachal Pradesh: అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ.. నేడే ప్రమాణ స్వీకారం