Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇందులో భాగంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్ప పీడనం ఏర్పడే అవకాశం వుంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఇప్పటికే దుకు వాతావరణం అనుకూలంగా మారింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన..…
Weather Update: తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అనేక జిల్లాల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గౌరారంలో 23.5 సెం.మీ, ఇస్లాంపూర్‌లో 17.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి, చిన్నశంకరంపేట, దామరంచ, మాసాయిపేటల్లో కూడా 15–17 సెం.మీ వరకు వర్షాలు కురిశాయి. సిద్ధిపేట…
Heavy Rain: హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, అమీర్‌పేట, టోలిచౌకి, బీరంగూడ, పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్, షేక్ పేట్, మెహిదీపట్నం, లంగర్ హౌస్, కోఠి, గచ్చిబౌలి, అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో వర్షానికి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.
Weather Updates :తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి గందరగోళంగా మారింది. భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రోజంతా మేఘాలు కమ్ముకున్నా, వర్షం మాత్రం కొన్ని చోట్లే కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మధ్య, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాయంత్రం తరువాత జల్లులు పడొచ్చని…
Heavy Rain: హైదరాబాద్ మహా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని నార్త్, సౌత్ ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, హయత్ నగర్, చైతన్యపురి, హబ్సిగూడ, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
: ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాజిల్లాలకు మరో రెండు రోజులు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాలు యాక్టివ్ గా వుండటం, ఆవర్తనాల ప్రభావంతో సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారుల వేటను నిషేధించారు. అటు, పశ్చిమ బెంగాల్ దగ్గర నిన్న అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ వైపు తరలిపోయి అల్ప పీడనంగా బలహీన పడుతోంది... వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకుండానే తీరాన్ని దాటిపోయింది.
Weather Update: రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ – దక్షిణ ఛత్తీస్‌గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు…
Rain Alert: నైరుతి ఋతుపవనాలు బుధవారం ( మే 28) నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
CM Revanth Reddy: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Rain In Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7.30 గంటలకి వాన ప్రారంభమైంది.