CM Chandrababu: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా డే.. లక్షల మందితో ప్రధాని యోగాసనాలు.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష..
- అంతర్జాతీయ యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే..
- మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాల నిర్వహణ..
- నెలరోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్..
- విశాఖలో లక్షల మందితో ప్రధాని మోడీ యోగాసనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: “‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు.. ‘జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని.. కనీసం రెండు కోట్లమందికి ఈ కార్యక్రమం చేరాలన్నారు.. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలిలని.. దీని కోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలన్నారు సీఎం చంద్రబాబు… ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని. . దీని కోసం ప్రైవేటు వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
నెలరోజుల పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలన్నారు సీఎం.. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలని.. అదే విధంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు.. యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలని.. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలన్నారు.. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు.. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు..
Read Also: Rajkumar Mishra: లండన్‌లో మేయర్‌గా ఎన్నికైన భారతీయుడు..
ఆర్‌కె బీచ్‌లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యోగా నిర్వహించేందుకు 68 ప్రాంతాలు గుర్తించారు. ఆర్కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, స్పోర్ట్చ్, నావీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. ఈ 68 లోకేషన్ల ద్వారా 2,58,948 మంది యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రకటించి 10 ఏళ్లు పూర్తియిన సందర్భంగా, ప్రధాని పాల్గొనే విశాఖ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా 5 లక్షల మంది భాగస్వాములు అయ్యేలా ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యోగా డే రోజుల ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా సాధన ఉంటుంది. 2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 36 వేల మందితో ఒకే వేదికపై నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. తొలి ఏడాది 84 దేశాల్లో యోగాను నిర్వహించారు. ప్రపంచంలోని 170కి పైగా దేశాలు యోగా డే ను ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. 2023లో సూరత్‌లో 1,53,000 మందితో ఒకే చోట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపి మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లకు ఎక్కింది. సూరత్ తరహా మోడల్‌లో విశాఖలోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించి.. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్, కేంద్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!