Fire Accident: టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని కాటేదాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ లోని సుమిత్ టింబర్ డిపో, బి.డి. ప్లైవుడ్ గోదాములో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. టింబర్ డిపోలో నిల్వ ఉంచిన చెక్కలు, దుంగలు, కట్టెలకు మంటలు వేగంగా వ్యాపించడంతో క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు మొదటగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటంతో వారు అదుపు చేయలేకపోయారు. భారీగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వి..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితమైన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!
ఇక గోదాముల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా పాటించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటేదాన్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!