CM Chandrababu: యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
Read Also: Jairam Ramesh: ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది..
ఇక, ఇవాళ్టి నుంచి యోగా మంత్ ప్రారంభం అవుతుంది.. యోగాంధ్ర పేరుతో నెల మొత్తం యోగా జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగాడేతో ప్రపంచంలో రికార్డులు బద్దలు అవ్వాలి.. 2 కోట్ల మందిని రాష్ట్రంలో భాగస్వామ్యం చెయ్యాలి.. మీడియా కూడా యోగాను ప్రమోట్ చేశారు. ప్రధాని ప్రపంచం మొత్తం యోగ ప్రమోట్ చేశారు. కాబట్టి వివిధ మాధ్యమాల్లో యోగా ప్రచారం జరగాలన్నారు ఏపీ సీఎం.. ఇప్పటికే మంత్రులతో ఒక కమిటీ ఉంది.. గ్రామ స్థాయిలో కూడా కలిపి ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తాం అన్నారు.. ప్రతి ఇంటిలో యోగా ప్రచారం జరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో జూన్ 21వ తేదీన 5 లక్షల మందితో యోగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Read Also: Revanth Reddy: రాజీవ్ గాంధీని స్మరించుకోవడమంటే.. తీవ్రవాదం మీద పోరాటం చేయడమే
మరోవైపు ఎన్నో మహానాడులు చేసాం.. అమరావతి రీ స్టార్ట్ కూడా చేశాం అన్నారు సీఎం చంద్రబాబు.. కానీ, అంతర్జాతీయ యోగా డే గేమ్ ఛేంజర్ అవ్వాలి అన్నారు.. ఇక, స్పా.. అంటే మసాజ్ కాదు.. మైండ్ రిలీఫ్ అన్నారు.. యోగ కంటిన్యూస్ చేయాలన్నారు. యోగా కొత్త విద్య కాదు.. కానీ, ప్రాక్టీస్ చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..