Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వి..
- తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారు
- రేపు నామినేషన్ దాఖలు చేయనున్న అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి
- అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో నామినేషన్ల పర్వం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్‌రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. వీరు రేపు (గురువారం) తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరును కూడా ఖరారు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఆయనకున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎంతో కాలంగా వెన్నంటి ఉన్న వేం నరేందర్‌రెడ్డికి ఈసారి అవకాశం దక్కింది. సీఎం పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి నరేందర్ రెడ్డి పార్టీ కోసం చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
అభ్యర్థులు ఖరారు కావడంతో, అభిషేక్ మను సింఘ్వి , వేం నరేందర్‌రెడ్డి రేపు అధికారికంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాలు , పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకుని మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Off The Record : ఢిల్లీ వర్సెస్ గల్లీ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై తెలంగాణ నేతల గుర్రు?
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!