నైరుతి రుతుపవనాలు "షార్ట్ బ్రేక్" తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించింది. దీంతో వర్షాలు ముఖం చాటేయగా వాతావరణం నిప్పులు కుంపటిగా మారింది. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ జనం అల్లాడి పోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతలు కోస్తాజిల్లాలను ఉడికెత్తిస్తున్నాయి.
Double-Decker Buses: చాలా కాలంగా ఎదురు చూస్తున్న అతిథి విశాఖకు వచ్చింది. బీచ్ టూరిజంకు అదనపు ఆకర్షణగా చేరింది. బీచ్ రోడ్డులో షికారు చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెండు బస్సులను అధికారులు తీసుకుని వచ్చారు.
Kamal Haasan : కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు వైజాగ్ తో తీరని అనుబంధం ఉంది. ఇక్కడకు 21 ఏళ్ల వయసు అప్పుడు వచ్చాను. అప్పుడు నా ముఖం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి టైమ్ లో నేను చేసిన మరో చరిత్ర…
విశాఖపట్నంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. Also Read: Coronavirus: కరోనా వైరస్ పట్ల…
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్‌గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహిస్తుండగా.. విశాఖలోని ఆర్కే బీచ్ లో వందల మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ గణ బాబు, కలెక్టర్, సిటీ పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. జూన్ 21 విశాఖలో జరిగే యోగా డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. వేలాది మందితో కలిసి ఆయన యోగాసనాలు వేయనున్నారు..
విశాఖ వన్‌టౌన్‌లో కూటమి పార్టీల మధ్య రాజకీయం రసకందాయంలో పడుతోంది. సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్, టీడీపీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య కోల్డ్ వార్ నెక్స్ట్ లెవెల్‌కు చేరిందని చెప్పుకుంటున్నారు. వంశీకృష్ణ ఎమ్మెల్యేతో పాటు జనసేన సిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సీతంరాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్‌తోపాటు విశాఖ దక్షిణం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉండాలి అని సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలి అన్నారు సీఎం చంద్రబాబు.. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు.
నకిలీ ఏసీబీ అధికారి కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.. నకిలీ ఏసీబీ అధికారి కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. నకిలీ ఏసీబీ వెనుక కిలాడీ లేడీ ఖాకీ ఉన్నట్టుగా చెబుతన్నారు అధికారులు..