Off The Record: జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్..! విశాఖలో పొలిటికల్ హీట్..!
- విశాఖ వన్‌టౌన్‌లో పొలిటికల్ హీట్..
- జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు..
- విశాఖ సౌత్‌లో అత్యంత బలంగా టీడీపీ..
- లీడర్స్‌తో పని లేకుండా కొనసాగే టీడీపీ కేడర్..
- 2024లో జనసేన నుంచి కూటమి తరపున వంశీ విజయం..
- వంశీకి కలిసొచ్చిన టీడీపీ బలం, వాసుపల్లి మీద వ్యతిరేకత..
- సౌత్ మీద తన ముద్ర వేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం..
- టీడీపీ నేతలకు అందుబాటులో ఉండటంలేదన్న విమర్శలు..
- బలపడేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విశాఖ వన్‌టౌన్‌లో కూటమి పార్టీల మధ్య రాజకీయం రసకందాయంలో పడుతోంది. సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్, టీడీపీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ మధ్య కోల్డ్ వార్ నెక్స్ట్ లెవెల్‌కు చేరిందని చెప్పుకుంటున్నారు. వంశీకృష్ణ ఎమ్మెల్యేతో పాటు జనసేన సిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సీతంరాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్‌తోపాటు విశాఖ దక్షిణం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవులు, అధికారం వేరైనా…. నేతల పరపతి ఒక్కటే కావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైందనే చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే నామినేటెడ్ పోస్టులు సహా నియోజకవర్గ స్థాయి పదవుల్లోనూ తమకు న్యాయం జరగడం లేదనే అసంతృప్తి రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఎక్కువైందట. సంస్థాగతంగా టీడీపీకి బలమైన దక్షిణ నియోజకవర్గంలో అంతర్గత పరిణామాలు ప్రమాదకర స్థాయికి చేరాయని సీనియర్లు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడ లేవని తెలిసినా అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం ఏంటంటూ.. కేడర్‌లో అసంతృప్తి పెరుగుతోందట.
Read Also: Devara : ‘చుట్టమల్లే’ సాంగ్ కు గుర్తింపు దక్కలేదు.. కొరియోగ్రాఫర్ కామెంట్స్..
Also Read
వాస్తవానికి విశాఖ సౌత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు. నాయకత్వంతో సంబంధం లేకుండా ఇక్కడ కేడర్ పటిష్టంగా ఉంది. ముస్లిం మైనార్టీలు, మత్స్యకార, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువ కాగా… బ్రాహ్మణ, వైశ్య వర్గాలు ఫలితాలను నిర్దేశిస్తుంటాయి. విశాఖ రాజకీయాల్లో ఉద్దండులు గెలిచిన స్థానంగా గుర్తింపు పొందిన సౌత్ సీట్లో… తొలిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా ట్రెండ్ మార్చి సక్సెస్ అయింది టీడీపీ. 2019లో రాష్ట్రం అంతటా వైసీపీ సునామీలో కొట్టుకుపోతే ఇక్కడి ఓటర్లు మాత్రం వాసుపల్లిని గెలిపించి లోకల్‌గా టీడీపీ బలాన్ని నిరూపించారు. వరుస విజయాలు, సంస్థాగతంగా పార్టీ పటిష్టత కోసం పనిచేసిన గణేష్ కుమార్ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ ఫిరాయించగా.. టీడీపీకి నాయకత్వ శూన్యత వచ్చిందిగానీ… కేడర్ బలహీనకపడక పోవడం కలిసి వచ్చింది. 2024 నాటికి కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ యాదవ్ అనూహ్యమైన ఫలితం సాధించారు. 64వేల 500పైచిలుకు మెజారిటీ సాధించడాన్ని ఆశ్చర్యంగానే చూశాయి రాజకీయవర్గాలు. ఈ విజయం వెనక అభ్యర్థిగా వంశీ బలం, జనసేన ప్రభావం కంటే పార్టీ ఫిరాయించిన వాసుపల్లి గణేష్‌పై ఓటర్లలో కనిపించిన వ్యతిరేకత…. టీడీపీ సమర్ధనాయకత్వం, పటిష్టమైన టీమ్ వర్క్ ఉన్నాయన్నది స్థానిక అభిప్రాయం.
Read Also: Devara : ‘చుట్టమల్లే’ సాంగ్ కు గుర్తింపు దక్కలేదు.. కొరియోగ్రాఫర్ కామెంట్స్..
ఎన్నికల్లో పోటీకి కొద్ది నెలల ముందు వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వంశీకృష్ణ యాదవ్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ ఫిరాయించి జనసేనలో చేరారు. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న వంశీకృష్ణ మొదటి నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా బరిలో దిగినా…. ఓటమి తప్పలేదు. అయితే….గత ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి చేసిన ప్రయత్నం కూటమి పార్టీల కలయిక కారణంగా సక్సెస్ అయింది. ఈ ఏడాది కాలంలో దక్షిణ నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం వంశీ యాదవ్ చేస్తూనే ఉన్నారు. పాత నగరంలో కాలుష్యం , డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రహదారులు వంటి సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో జనసేన కేడర్ కు తప్ప టిడిపి నాయకులకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇప్పుడు జనసేన బలోపేతం కోసం వైసీపీలో ఉన్న నాయకుల్ని ఎమ్మెల్యే ప్రోత్సహించడం టిడిపి శ్రేణులకు నచ్చడం లేదట.
Read Also: Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా.. సీన్ లోకి హీరో అత్త..
అటు టీడీపీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ నియోజకవర్గంలో బలపడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎంపీ భరత్ వర్గీయుడుగా ముద్రపడటం, అధికార పార్టీ ఇంచార్జ్ హోదాలో ఎమ్మెల్యేతో సమానంగా పనిచేసుకు పోతుండటం వంటి కారణాలు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో దక్షిణ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఇటు వంశీ, అటు సుధాకర్ పబ్లిక్ గ్రీవెన్స్ పేరుతో నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక విధంగా ఇద్దరు నేతలు జనం సమస్యలపై పనిచేయడం సానుకూలమైనప్పటికీ… రెండు పార్టీల కేడర్‌లో మాత్రం సంతృప్తి మాత్రం కనిపించడం లేదట. పైగా…వైసీపీ నుంచి వస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారంటూ ఇద్దరూ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందుకు కారణం కూడా లేకపోలేదు. గత ఎన్నికల ముందు వరకు వంశీ, సీతం రాజు ఇద్దరూ… వైసీపీలోనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధిపత్యం ప్రదర్శించడానికే నేతలు ప్రాధాన్యత ఇస్తుండటంతో పరిస్థితి సంక్లిష్టంగా మారుతోందన్నది కేడర్ ఆవేదన.
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!