ఏపీ వైద్య శాఖలో బదిలీల వివాదం రాజుకుంది. ఐదేళ్లు సర్వీసు పైబడిన వారికి స్థాన చలనం కలిగించాలన్న ఆదేశాలను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఎంసీఐ నిబంధనల మేరకు పరిశోధనలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. వైద్యశాఖలో జీవోఆర్టీ నెంబర్ 40 కుదుపు మొదలైంది. ఈ ఆదేశాల ప్రకారం ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న వైద్యులను బదిలీ చేయాలిసి ఉంటుంది. మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు కూడా బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కౌన్సెలింగ్…
విశాఖను డ్రగ్స్ మత్తు ఆవరిస్తోంది. డ్రగ్స్ పెడ్లర్స్ స్టీల్ సిటీని సేఫ్ సిటీగా భావిస్తున్నట్టు అనిపిస్తోంది. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై యువత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్దులు, యువతనే టార్గెట్ చేసుకుని విశాఖ నుంచి విజయవాడ, ముంబైకి డ్రగ్స్ తరలిపోతున్నాయి. విశాఖకు చెందిన పోలీసులు పలువురు యువతను అరెస్ట్ చేశారు. నగరంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.…
ఏపీలో మళ్ళీ మూడురాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికల హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 26జిల్లాలు ఏవిధంగా వచ్చాయో….మూడు రాజధానులు అదే విధంగా వస్తాయన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవ్వడం ఖాయం అని ధీమాగా చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు ఊహలు, అయోమయంలో ఉంటారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో…!? వ్యతిరేకమో చెప్పాలన్నారు. చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగానే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. సీఎంకు గిరిజనులపై…
విశాఖలో మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. తాజాగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు ఎంవీపీ పోలీసులు. అక్కయ్యపాలెంకు చెందిన రాహుల్, పెద గంట్యాడకు చెందిన అఖిల్ అనే ఇద్దరు యువకులు వద్ద నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఎల్ ఎస్ డి బ్లాస్ట్, గంజాయి, ఓసీబీ షీట్స్, ఎమ్ డిఎంఏ పిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎంవీపీ సీఐ రమణయ్య తెలిపారు. వీరిద్దరూ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కోవిడ్ పాజివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, మరోసారి విశాఖపట్నంలో రికార్డు స్థాయిలో రోజువారి కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ కేసుల నమోదులో మళ్లీ టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది వైజాగ్.. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు పైగానే వెలుగు చూశాయి.. గడిచిన 24 గంటల్లో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా..…
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. తాజాగా అమరావతి నుంచి ప్రారంభం అయిన ఉద్యమం విశాఖ సాగరతీరానికి చేరింది. విశాఖ జిల్లా స్ధాయిలోనూ ఉద్యోగ జేఏసీలు ఏకమయ్యాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటయినట్టు సమితి కన్వీనర్ ఈశ్వర్రావు తెలిపారు. ఈనెల 25 న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన తెలుపుతామంటున్నారు. ఫిబ్రవరి 3 న ఛలో విజయవాడ తలపెట్టామన్నారు. తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి వారి మద్దతు కూడగట్టుకుంటామన్నారు ఈశ్వరరావు. ఫిబ్రవరి 7 తేదీన…
విశాఖ జిల్లాలో సినిమా హాళ్ళలో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో యజమానులు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వివిధ నిబంధనల పేరుతో థియేటర్లకు అధికారులు నోటీసులు జారీచేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము థియేటర్లను నడపలేం అంటున్నారు యజమానులు. ఇప్పటికే కరోనా వల్ల దివాలా తీశామని, ప్రభుత్వం విధించే ఆంక్షలతో థియేటర్లు మూసివేయడమే శరణ్యం అంటున్నారు.
ఆ యువ ఎమ్మెల్యేకు హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చిందా.. లేక ఆశలకు కత్తెర వేసిందా? ఎమ్మెల్యే ఆశిస్తున్నదేంటి.. వచ్చిన పదవివల్ల కలిగే లాభనష్టాలేంటి? కేడర్లో భిన్నవాదనలెందుకు? ఏ విషయం వారికి అంతుబట్టడం లేదు? అమర్నాథ్కు పార్టీ పరంగా కీలక బాధ్యతలువిశాఖజిల్లాలో పార్టీ పటిష్టతపై YCP స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే కాకుండా ఇక్కడ అధికారపార్టీకి 11మంది శాసనసభ్యుల బలం ఉంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించినా.. రెండున్నరేళ్లు తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్యేలకు…
చేనుకు పురుగు పడితే మందులు చల్లుతారు. కానీ అక్కడ పురుగు పడితే పండగ చేసుకుంటారు. పురుగులను వంట చేసుకొని తింటారు. పురుగులే వారికి జీవనాధారం. ఇదిగో ఇవే తెల్లటి పురుగులు గిరి పుత్రులకు ఎంతో ఇష్టమైన ఆహారం. ఆ పురుగులను తినడమే కాకుండా.. వాటిని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మన్యం రొయ్యగా వీటికి పేరుంది. విశాఖ ఏజెన్సీలో పూర్వకాలం నుండి ఈ పురుగులు తినడం గిరిపుత్రుల ఆహార శైలిలో ఓ భాగం. ప్రస్తుతం ఆ పురుగులను…
విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం కొలిక్కిరాలేదు. కలెక్టరేట్లో జరిగిన ఇరు వర్గాల చర్చలు విఫలం కావడంతో పంచాయితీ మొదటికొచ్చింది. రాజీ కుదిర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రింగ్ వలల వివాదంపై విశాఖ కలెక్టరేట్లో ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మత్స్యకారుల సమావేశం జరిగింది. జీవో ప్రకారం వేట కొనసాగిస్తే… తమకు ఉపాధి దక్కడం కష్టమవుతుందని రింగ్ వలల మత్స్యకారులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం రింగు వలల మత్స్యకారులు వేటకు…