Israel-Iran War: ‘‘ఆపరేషన్ సిందూర్’’ నుంచి యూఎస్, ఇజ్రాయిల్ పాఠాలు నేర్చుకున్నాయా.? ఇరాన్ యుద్ధంలో ఏం చేస్తున్నాయి..?
- ఇండియా స్ట్రాటజీ ఫాలో అవుతున్న ఇజ్రాయిల్, యూఎస్..
- ఆపరేషన్ సిందూర్‌లో కిరాణా హిల్స్ దాడి లాగే ఇరాన్‌పై అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ వరసగా ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్‌లపై కూడా దాడులు చేస్తోంది. ముఖ్యంగా, యూఎస్ బేస్‌లను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో యూఎస్, ఇజ్రాయిల్ దళాలు ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ అనుసరించిన స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
కిరాణా హిల్స్ దాడే స్పూర్తి:
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత, పాక్ సైన్యం దాడికి పాల్పడితే, భారత్ పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
అన్నింటికన్నా ముఖ్యమైన దాడి ‘‘కిరాణా హిల్స్’’గా చెప్పబడుతుంది. నిజానికి కిరాణా హిల్స్‌పై దాడి చేసినట్లు భారత్ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా అంతర్జాతీయ నిపుణులు దాడి వాస్తవమని చెబుతున్నారు. ఈ దాడి తర్వాతే, పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి, కాల్పులు విరమణ కోసం ప్రాధేయపడింది.
కిరాణా హిల్స్ పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెట్టే ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడి గుహాలో ఆయుధాలను నిల్వ చేస్తారు. భారత్ ఈ గుహకు ముఖద్వారాల వద్ద దాడులు చేసింది. దీంతో వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఈ దాడి చాలా ఖచ్చితత్వంతో జరిగింది. భారత్ సురక్షితంగా ఎలాంటి రేడియేషన్ ముప్పు, అణు ముప్పు లేకుండా దాడి చేసింది.
ఇదే పనిచేస్తున్న యూఎస్, ఇజ్రాయిల్ :
ఇరాన్ యుద్ధంలో కూడా యూఎస్, ఇజ్రాయిల్ ఇదే స్ట్రాటజీని అవలంభిస్తున్నాయి. ఇరాన్ దశాబ్ధాలుగా భూగర్భంలో మిస్సైల్ సిటీలను నిర్మించింది. ఇందులోనే డ్రోన్లు, మిస్సైళ్లను దాచిపెడుతోంది. వీటిని దాడిన బంకర్లు చాలా బలంగా ఉన్నాయి. కానీ యూఎస్ ఇజ్రాయిల్ దళాలు వాటిని నాశనం చేయడానికి బదులుగా వాటి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద దాడులు చేస్తోంది. దీంతో లోపల ఉన్న మిస్సైల్స్, డ్రోన్లు, ఇతర ఆయుధాలు బయటకు తీసువచ్చే ఛాన్స్ లేకుండాపోయింది. ఒక నివేదిక ప్రకారం, ఇరాన్ మిస్సైల్ , డ్రోన్ దాడులు దాదాపుగా 80 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాన్ బీ-2, బీ-52 బాంబర్లు భారీగా బాంబులు వేస్తూ బంకర్లను మూసేశాయి.
తాజావార్తలు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?