విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది… కూర్మన్నపాలెం మెయిన్ గేటు వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పీపుల్స్‌స్టార్ ఆర్ నారాయణ మూర్తి మద్దతు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం చేపట్టి ఏడాది అవుతున్న కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. కార్మికుల ఉద్యమం పట్టించుకోదా..? ఏ ముఖం పెట్టుకొని విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణమూర్తి.. ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వెళ్తే ఆ వేష భాష వేస్తారు మన ప్రధాని మోడీ.. ఈ సారి విశాఖ వస్తే విశాఖ ఉక్కు కార్మికుడి వేషంలో రావాలని డిమాండ్ చేశారు. అలా వస్తే అప్పుడు కార్మికులు, నిర్వాసితుల కష్టం తెలుస్తుందన్నారు నారాయణమూర్తి.
Read Also: Hijab: సీఎం సంచలన వ్యాఖ్యలు.. మేం తిరిగి అధికారంలోకి వస్తే..!
దేశంలోనే గొప్ప పోర్డు అయిన గంగవరం పోర్టును ఆదానికి అమ్మేశారని మండిపడ్డారు నారాయణ మూర్తి.. ఉక్కు పరిశ్రమపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేసిన ఆయన.. ఎళ్ల పాటు ఇలా కార్మికులు దీక్షలు చేయకూడదు అని కోరుకుంటున్నాను అన్నారు.. ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారని కేంద్రంపై ఫైర్ అయిన పీపుల్స్ స్టార్.. ప్రత్యేక హోదా మీద లిస్ట్‌లో పెట్టి తొలగించారు… ఇది ఎంత దారుణమైన విషయం దారుణం అన్నారు.. ఇకనైనా అన్ని రాజకీయ పార్టీలు జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి… విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు నారాయణమూర్తి.