సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… ఉగాది కానుకగా పేద, మధ్య తరగతిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని.. ఇది పెను భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏడు సార్లు పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్న ఆయన.. ఎమ్మెల్యేలు గానీ,…
సీఎం వైఎస్ జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయని.. విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఆయనకు భయపడతారని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడన్న లోకేష్… పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే…
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటం సాగుతోంది.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు దీనికి వ్యతిరేకంగా కార్మికులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇక, వివిధ రాజకీయ పార్టీలు వీరికి మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు…
ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది. స్మార్ట్ సిటీ ఛైర్మన్ల పదవులకు గండం ఏర్పడింది. ఈ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. దీంతో స్మార్ట్ సిటీ ఛైర్మన్ల వరుస రాజీనామాలకు తెరతీసింది ప్రభుత్వం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు. సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. స్మార్ట్ సిటీ…
తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఉత్తరా౦ధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న.. రాష్ట్ర ప్రజలంతా ‘జే’ టాక్స్ కడుతుంటే… విశాఖ ప్రజలు ‘వీజే’ టాక్స్ కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారన్న ఆయన.. సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ప్రజాదర్బార్ పెడితే ఆయనకి తెలిసినవి, తెలియకుండా విజయసాయి రెడ్డి…
ఏపీకి సంబంధించి విభజన హామీల అమలులో హంగు ఆర్భాటాలే గానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు కేంద్రం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిమిత్తం ఇప్పటి వరకు నయాపైసా ఖర్చు పెట్టలేదు కేంద్రం.సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు కేంద్రం కేటాయింపులు.. నిధుల విడుదల.. ఖర్చుల వివరాలను వెల్లడించింది కేంద్ర రైల్వే శాఖ. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ అర్జీకి రిప్లై ఇచ్చింది కేంద్రం. 2020-21 బడ్జెట్టులో విశాఖ జోన్, రాయగఢ…
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడదలైంది.. మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని పేర్కొన్నారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో…
విశాఖ మన్యంలో మావోయిస్టుల తాజా లేఖ కలకలం రేపుతోంది… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ లేఖ రాశారు మావోయిస్టులు.. లేట్రైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని లేఖ విడుదల చేశారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని లేఖలో డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ…
వాళ్లంతా ఢిల్లీ సభకు ప్రతినిధులు. రాష్ట్ర అభివృద్ధికి వారథులు. లక్షల మంది ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం ఉంది. జాతీయస్ధాయిలో ముఖ్యనేతలను కదిలించే సత్తా ఉంది. వాళ్లు మాత్రం తాము నిమిత్త మాత్రులమే అంటున్నారు. దీంతో జనం వాళ్లను మర్చిపోయారని చర్చ నడుస్తోంది. వన్‌టైం పొలిటిషన్ల కింద లెక్కగట్టి లైట్ తీసుకుంటున్నారట. ఇంతగా వీకైపోయిన ఆ ప్రజాప్రతినిధులు ఎవరు? ఏమా కథా? రియల్‌టైమ్ రాజకీయ నేతలుగా మారలేదా?ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంపీలు చాలా పవర్ఫుల్. పాలిటిక్స్ అన్నీ వాళ్ల…
టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో…