Mp Vijaysai Garrage: పార్టీని గాడిలో పెడతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయబోతున్నారా? పార్టీ.. ప్రభుత్వం లైన్ దాటి రాజకీయాలు చేస్తున్న వారి లెక్కలు తేల్చేస్తారా? ఈ బాధ్యతను పార్టీలో కీలక నేతకు అప్పగించడంతో శాసనసభ్యులు అలెర్ట్ అయ్యారా? ఎక్కడో.. ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
అంతర్గతంగా నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోందా?
ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా. ఇక్కడ బీసీ, కాపు సామాజికవర్గాలు ఎవరికి కొమ్ముకాస్తే వాళ్లే విజేతలు. గత ఎన్నికల్లో ఈ ఫార్ములాను గట్టిగా పట్టుకోవడమే కాకుండా పక్కాగా వర్కవుట్ చేసింది వైసీపీ. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ స్థానాలకుగాను టీడీపీ గెలిచింది ఆరు చోట్లే. విజయనగరం జిల్లాను వైసీపీ క్లీన్‌స్వీప్ చేయగా.. శ్రీకాకుళంలో రెండు, విశాఖ సిటీలో నాలుగుచోట్ల సైకిల్ పార్టీ గెలిచింది. ఈ రెండున్నరేళ్లలో ఫ్యాన్ పార్టీ జోష్ తగ్గలేదు. అయితే అంతర్గతంగా మాత్రం నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోంది. గ్రూప్ రాజకీయాల వేడిలో కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చలి కాచుకోవడం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
ప్రమాదకర సంకేతాలు పంపిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు
వైసీపీ ద్వితీయశ్రేణికి, కేడర్‌కు అండగా నిలవడం ద్వారా పార్టీ పటిష్టత కోసం పని చేయాల్సిన ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకి ప్రమాదకర సంకేతాలు పంపించాయి. మూడు జిల్లాల్లోనూ అసంతృప్తులు ఉండగా.. ఇటీవల పాయకరావుపేట, టెక్కలిలో విభేదాలు రోడ్డెక్కాయి. చాలా నియోజకవర్గాలలో ఆధిపత్య రాజకీయం శ్రుతిమించుతోంది. ఇందుకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాలిటిక్స్. ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్ జడ్పీటీసీగా ఓడిపోయారు. ఇదే జిల్లాలో మిగతా అన్నిచోట్ల వైసీపీ గెలిచింది. ఇవన్నీ కొన్ని లెక్కలు మాత్రమే. అందుకే వైసీపీ హైకమాండ్ కీలక చర్యలకు ఉపక్రమించింది.
నియోజకవర్గాల వారీగా వైసీపీ సమీక్షలు
నేతల మధ్య ఆధిపత్య పోరును కట్టడి చేయడం.. పార్టీ గెలుపుకోసం పోరాటం చేసిన వారిని గుర్తించి ప్రోత్సహించేలా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధ అవుతోంది వైసీపీ. ఆ పని ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం చుట్టనుండగా ఆ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల్లో పెట్టింది హైకమాండ్. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు రాజకీయ సమీక్షలకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ కేంద్రాలకు వెళ్లినప్పుడు మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశనిర్ధేశం జరిగినట్టు వినికిడి. అలాగే ఆధిపత్య పోరుపైనా ఫోకస్ పెడతారట.
యాక్షన్ ప్లాన్ తెలిసి ఎమ్మెల్యేలు అప్రమత్తం
ఈ నెల 22 నుంచి సమీక్షలు ప్రారంభమవుతాయని ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహిత వర్గాల సమాచారం. ఎన్నికల హామీలు ఏ మేరకు నెరవేరాయి..!? పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయడం వంటి కంప్లీట్ టాస్క్ సాయిరెడ్డి చేతుల్లో పెట్టినట్టు పార్టీవర్గాల అంతర్గత చర్చ. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ నేరుగా అధిష్ఠానానికి చెప్పుకునే వెసులుబాటు లేదు. ఉత్తరాంధ్రలో పార్టీకి బాధ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి.. పార్లమెంట్ సమావేశాలు.. ఇతర పనులు కారణంగా బిజీగా ఉంటున్నారు. కొద్దికాలంగా ఆయన రాజకీయ దూకుడు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై ఫోకస్ ఉంచారు. ఆయన నిర్వహిస్తోన్న ప్రజాదర్భార్‌కు విశేష స్పందన వస్తోందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. సాయిరెడ్డి యాక్షన్ ప్లాన్ తెలిసినప్పటి నుంచీ కొందరు ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారట. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని బహిరంగంగా చెబుతూనే సయోధ్యకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!