విశాఖ మన్యంలో మావోయిస్టుల తాజా లేఖ కలకలం రేపుతోంది… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ లేఖ రాశారు మావోయిస్టులు.. లేట్రైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని లేఖ విడుదల చేశారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని లేఖలో డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ…
వాళ్లంతా ఢిల్లీ సభకు ప్రతినిధులు. రాష్ట్ర అభివృద్ధికి వారథులు. లక్షల మంది ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం ఉంది. జాతీయస్ధాయిలో ముఖ్యనేతలను కదిలించే సత్తా ఉంది. వాళ్లు మాత్రం తాము నిమిత్త మాత్రులమే అంటున్నారు. దీంతో జనం వాళ్లను మర్చిపోయారని చర్చ నడుస్తోంది. వన్‌టైం పొలిటిషన్ల కింద లెక్కగట్టి లైట్ తీసుకుంటున్నారట. ఇంతగా వీకైపోయిన ఆ ప్రజాప్రతినిధులు ఎవరు? ఏమా కథా? రియల్‌టైమ్ రాజకీయ నేతలుగా మారలేదా?ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంపీలు చాలా పవర్ఫుల్. పాలిటిక్స్ అన్నీ వాళ్ల…
టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో…
వారిద్దరు ఒకేలా వుండే అక్కాచెల్లెళ్ళు. ప్రియా, ప్రియాంక అనే ఈ ట్విన్స్ ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషన్. 2003 నవంబర్ 4 th న జన్మించిన వీరిద్దరూ ఇప్పుడు వైరల్ అవుతున్నారు. వీళ్ళ నాన్నది వైజాగ్, అమ్మది వెస్ట్ బెంగాల్. లవ్ మ్యారేజ్. ప్రస్తుతం గాజువాక లో ఉంటున్నారు, నాన్న స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. వీరికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. బీవీకే కాలేజ్ లో ప్రియా ప్రియాంక బీకాం ఫైనల్…
కవలలు కొంతమంది కనిపిస్తే వారిని గుర్తుపట్టలేం. కానీ కళ్ల ముందు ఇరవై ముప్పై మంది కనిపిస్తే వారిని గుర్తు పట్టడం ఇంకా కష్టం. రోజూ చూసేవారిని సైతం అంత ఈజీగా గుర్తుపట్టలేం. అలాంటిది ఒకే ఫ్రేమ్ లో 30 కు పైగా కవల జంటలు… ఒకే చోట చేరితే ఆ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు. చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి అద్భుత దృశ్యమే విశాఖలో కనువిందు చేసింది. ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు…
ఇవాళ ట్విన్స్ డే. ఒకే తల్లి కడుపున కవలలుగా జన్మించిన వారంతా కలిసి చేసుకునే అద్భుతమయిన వేడుక అది. సాగరతీరం విశాఖలో కవలలు సందడి చేశారు. విశాఖలో 30కి పైగా కవల జంటలు ఆడి పాడారు. అందరితో సంతోషంగా గడిపారు. ఒకేరూపం మనుషులు మాత్రం ఇద్దరు. అదేదో సినిమాలో చూసినట్టుగా వీరంతా ఒకేచోట కలిసి చేసిన సందడి అదరహో అనిపించింది. విశాఖ నగరంలోని ఓ హోటల్ లో ట్విన్స్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఏపీ-తెలంగాణ కు చెందిన…
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయబోతున్నారా? పార్టీ.. ప్రభుత్వం లైన్ దాటి రాజకీయాలు చేస్తున్న వారి లెక్కలు తేల్చేస్తారా? ఈ బాధ్యతను పార్టీలో కీలక నేతకు అప్పగించడంతో శాసనసభ్యులు అలెర్ట్ అయ్యారా? ఎక్కడో.. ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. అంతర్గతంగా నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోందా?ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా.…
తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కి అంతా రెడీ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు రివ్యూ ప్రారంభం కానుంది. ఈ సమీక్షలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రమే విశాఖ వచ్చారు. ఆయనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి సీఎం జగన్ ప్రత్యేకంగా జ్ఞాపికను బహూకరించారు. 9కి ప్రారంభం కానున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ 9.07 కి…
సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి. మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల…
ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్నారు సీఎం జగన్. అక్కడ పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం కడప జయరాజ్ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు సీఎం. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం. తదనంతరం సాయంత్రం సీఎం విశాఖ పర్యటన వుంటుందని సీఎంవో…