Petrol&Diesel Price: వార్ ఎఫెక్ట్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు రేటు ఎంత?
- పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది
- 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17కి పెరిగింది
- 1 లీటర్ డీజిల్ ధర రూ.335.86కి పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్‌పై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రాత్రికి రాత్రే గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలో ఇదే భారీ పెరుగుదల.
Also Read:Best Bikes: లీటరుకు 70KM మైలేజ్.. రూ. 70,000 కంటే తక్కువ ధర.. ఈ బైక్స్ పైనే అందరి ఫోకస్
Also Read
పాకిస్తాన్ న్యూస్ పోర్టల్ ది డాన్ నివేదిక ప్రకారం, శుక్రవారం-శనివారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో, పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్, ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్‌తో కలిసి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రకటించారు. పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా ఈ విలేకరుల సమావేశంలో ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు, మన దగ్గర సరిపడ పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపారు.
పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు ఎంత?
పాకిస్తాన్‌లో ధరల పెరుగుదల తర్వాత, 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17కి పెరిగింది, అయితే 1 లీటర్ డీజిల్ ధర రూ.335.86కి పెరిగింది. పాకిస్తాన్ తన ముడి చమురు కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడి ఉంది. హార్ముజ్ జలసంధి ప్రతిష్టంభన పాకిస్తాన్‌కు చమురు సరఫరాకు అంతరాయం కలిగించింది. ధరలు మరింత పెరుగుతాయోమోనన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ పంప్స్ కు క్యూ కట్టారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!