ఆంధ్ర రాష్ర్టానికి శ్రీవేంకటేశ్వర స్వామే ఆస్తి అన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. శ్రీవారి అనుగ్రహం లేకుండా తిరుమలలో ఏ కార్యక్రమం జరగదన్నారు. శ్రీవారిని సాక్షాత్కారం చేసుకున్న అన్నమయ్య,పురంధరదాసు,తరిగోండ వెంగమాంబ అంజనాద్రియ్యే తిరుమల అని చెప్పారు. వీరు చెప్పిన తరువాత కూడా ప్రామాణితలు కావాలని కోరడం సమంజసమా?
రామజన్మ భూమిని నిర్దేశించిన చిత్రకూట్ పీఠాధిపతులు రామభద్రాచార్యుల వారు కూడా అంజనాద్రియ్యే హనుమంతుడి జన్మస్థలంగా నిర్దేశించారు. మరోవైపు హనుమంతుడి జన్మస్థలం నిర్దారణ కోసం కమిటీని ఏర్పాటు చేసాం అన్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. చారిత్రక,పురాణ,పౌరాణిక ,ఇతిహాసాలు,శాసనాలతో కూడిన ఆధారాలతో అంజనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా నిర్దారించారు.
కమిటీ నిర్ణయం పై అభ్యంతరాలు వుంటే ఆధారాలతో రావాలని బహిరంగ చర్చకు ఆహ్వానించాం అన్నారు. ఒక్కరిద్దరు వచ్చినా వారు ఆధారాలు సమర్పించలేదు. దీంతో కమిటీ నివేదిక మేరకు అంజనాద్రి అభివృద్దికి స్వీకారం చుట్టాం అన్నారు జవహర్ రెడ్డి. అంజనాద్రి అభివృద్ది పనుల ఆర్కిటెక్ డిజైన్లు విడుదల చేశారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. ఈ కార్యక్రమంలో రామభద్రాచార్యులు, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,ఈవో జవహర్ రెడ్డి,ఏఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.