Presidential Naval Fleet Review: యుద్ధనౌకల సమీక్షకు వేదికైన విశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి.
మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల క్రితం నేవీ అమ్ముల పొదిలో చేరింది ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నం. శత్రువులపై విరుచుకుపడే అతిపెద్ద డిస్ట్రాయర్ నౌకగా ఐ.ఎన్.ఎస్.విశాఖపట్నంకు గుర్తింపు వుంది.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
కల్వరి సిరీస్ లో నాలుగవ సబ్ మెరైన్ ఐ.ఎన్.ఎస్. వేల. యాంటీషిప్ మిసైళ్లతో విరుచుకుపడే శక్తి సామర్థ్యం వేల జలాంతర్గామి ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టానికి వేదికైంది విశాఖ. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. యుద్ధనౌకల సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్. ఐ.ఎన్. ఎస్.సుమిత్రలో ప్రయాణించనున్నారు రాష్ట్రపతి. ఆర్కేబీచ్ నుంచి తెన్నేటి పార్క్ వరకు కొనసాగనుంది పీఎఫ్ ఆర్. రాష్ట్రపతి 44 యుద్ధ నౌకలను సమీక్ష చేయనున్నారు. పీఎఫ్ఆర్ లో 60 యుద్ధ విమానాలు,హెలీకాప్టర్లు పాల్గొంటున్నాయి. యుద్ధ నౌకలు 55 వున్నాయి. ప్రెసిడెంట్ ప్రయాణించే ఐ.ఎన్. ఎస్. సుమిత్రను అనుసరించనున్నాయి రెండు యుద్ధ నౌకలు. పీ.ఎఫ్.ఆర్.లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ పాల్గొంటాయి.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అండమాన్ నికోబార్ లఫె్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి డి.జె.చౌహాన్, రాష్ట్ర హోంమంత్రి ఎం.సుచరిత, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రిత్వశాఖల కార్యదర్శులు, తదితరులు పి.ఎఫ్.ఆర్. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ సమీక్ష సముద్రంలో జరగనుండడంతో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని సీపీ తెలిపారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!