Twins Hungama in Vizag: కవలల హంగామా.. అల్లరి చూడతరమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కవలలు కొంతమంది కనిపిస్తే వారిని గుర్తుపట్టలేం. కానీ కళ్ల ముందు ఇరవై ముప్పై మంది కనిపిస్తే వారిని గుర్తు పట్టడం ఇంకా కష్టం. రోజూ చూసేవారిని సైతం అంత ఈజీగా గుర్తుపట్టలేం. అలాంటిది ఒకే ఫ్రేమ్ లో 30 కు పైగా కవల జంటలు… ఒకే చోట చేరితే ఆ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు. చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి అద్భుత దృశ్యమే విశాఖలో కనువిందు చేసింది. ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్విన్స్ ఒకే దగ్గరకు చేరి సందడి చేసారు..ఈ బొమ్మనా బ్రదర్స్., చందన సిస్టర్స్ చేసిన ఆ హంగామా అంతా ఇంతా కాదు.
వారంతా దేవుడు చేసిన మనుషులు. మనుషులను పోలిన మనుషులు ఈ సృష్టిలో ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. ఇది కనిపెట్టడం చాలా అరుదు.. అలాగే ఏదైనా ఊరిలోనో, ఇంటిలోనో కవలలు ఉంటే వారిని చూసి ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా ఎంతో సంబరపడిపోతుంటాం. ఎందుకంటే ఒకే పోలికలతో అచ్చుగుద్దినట్టు జన్మించడం ఓ విధంగా దేవుడిచ్చిన వరమనే చెప్పుకోవాలి. అలాంటి వారికోసం ఫిభ్రవరి 22 న ప్రపంచ కవలల దినోత్సవంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణాలో ఉన్న కవలలు ఒకే వేదికపై కలవాలనుకున్నారు. అయితే దానికోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్ లక్ష్మణ్ అనే ట్విన్ బ్రదర్స్ ముందుకొచ్చారు. వారు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రెండు రాష్ట్రాలలో ఉన్న కవలలను గుర్తించి వారిని కలుపుకున్నారు.
Also Read
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
ఆటపాటలతో, డ్యాన్స్ లతో, వెరైటీ వెరైటీ గేమ్స్ లను కండక్ట్ చేసి ఎంజాయ్ చేసారు. తమలాగే ఈ ప్రపంచంలో ఇంతమంది కవలలు ఉన్నారా అని తెగ సంబరపడిపోయారు. విద్యార్ధులు, చిన్నారులు, గృహిణులు, ఉద్యోగులు వీరంతా ఈ కవలలులో ఉన్నారు. ఈ రోజుని ఓ పండగలా జరుపుకున్నామని తెలిపారు.. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఎంజాయ్ చేశారు. అంతేకాదు కవలలుగా తాము ఎదుర్కొంటున్న ఘటనలు, సరదా సన్నివేశాల వంటివి షేర్ చేసుకున్నారు.ఈ కవలల్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదంటున్నారు సందర్శకులు, మిత్రులు.

తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?