విశాఖలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. డిఆర్సీ మీటింగ్ ప్రాంగణం బయట జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో పేదలు నిరసనకు దిగారు. అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారంటూ స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ జి.వి. విశాఖ ఎంపీ ఎమ్.వి.వి సత్యనారాయణ లకు వ్యతిరకంగా బ్యానర్ల ప్రదర్శన నిర్వహించారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఎండాడలో సర్వే నెంబర్ 92/3 లో పన్నెండున్నర ఎకరాలభూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. దొంగదారిలో…
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వచ్చీరావడంతోనే సంచలనం రేపింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రైడింగ్ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్ డెలివరీలు ఇంకొంత కాలం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ఆలస్యానికి చిప్‌ల కొరతే కారణమని తెలుస్తోంది. దేశీయంగా చిప్ ల తయారీ…
అమరావతిని రాజధానిగా అంగీకరించాలని ఒకవైపు అమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తున్న వేళ మంత్రులు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల ధరలు పెంచుకోవటం కోసమే ప్రయత్నిస్తూ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ఆరోపించారు. నగరి లో మండల సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడారు ఎమ్మెల్యే రోజా. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పన్నులు కడుతుంటే సమావేశంలో పాల్గొన్న నాయకులు కేవలం అమరావతి పరిధిలోని 29…
గోవును తల్లిగా భావిస్తాం. గోవుల సంరక్షణకు ఖర్చుపెడుతున్నా.. కొన్ని గోవులు మాత్రం దాణా లేక తిరిగి రాని లోకాలకు చేరిపోతున్నాయి. విశాఖపట్నంలోని రామానంద ఆశ్రమంలో గోవుల బాధ అంతా ఇంతా కాదు. గో మరణాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 4 గోవులు మృతిచెందాయి. దాణా, నీరు లేక కోమాలోకి వెళుతున్నాయి గోవులు. రామానంద ఆశ్రమంలో ఆకలితో అల్లాడుతున్నాయి 160కి పైగా గోవులు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి అక్రమంగా తరలిస్తోన్న 160 గోవులను పట్టుకుని…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన.. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్‌తో పాటు.. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.. మొత్తంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు విశాఖలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: డిసెంబర్ 17, శుక్రవారం రాశిఫలాలు… ఇక, సీఎం వైఎస్…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి, ఇతర ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ జరిపారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. విశాఖను పెట్టుబడులకు వేదికగా మలుచుకోవాలన్న సీఎం ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్నారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్‌చక్రవర్తి.…
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ప్రభుత్వం బిల్లుని ఉపసంహరించుకోవడం… మళ్ళీ సమగ్రంగా బిల్లుని ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో రాష్ర్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజధానుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా విశాఖ పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు కుట్ర చేసారు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది. అమరావతి రైతులు అర్ధం చేసుకోవాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.…
అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియచేసుకునేందుకు వచ్చామన్నారు హీరో బాలయ్యబాబు. ఏడాది తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పారు హీరో బాలకృష్ణ. ఇది మా విజయం మాత్రమే కాదు….చిత్ర పరిశ్రమ విజయం అన్నారు బాలకృష్ణ. ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను…
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య అరుపులు మారుమ్రోగిపోతున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూడడానికి నిజమైన అఘోరాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్లో ఇద్దరు అఘోరాలు సందడి…