సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స జరుగుతోందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులకైనా తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: సింహాచలం ఘటన దురదృష్టకరం
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ జిల్లా సింహాచలంలో భారీ వర్షం కురిసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించాం. పోలీసులు, ఎస్డీఆర్…
— Lokesh Nara (@naralokesh) April 30, 2025