విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు. దీంతో విశాఖ కేజీహెచ్ దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఎంత మంది ఓదార్చినా.. ఎవరి తరం కావడం లేదు. అంతగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారంటూ బంధువులు రోదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి
పతి దుర్గ స్వామి నాయుడు గత మూడేళ్లుగా విశాఖలోని సీతమ్మదారలో నివాసం ఉంటున్నాడు. మృతుడు స్వగ్రామం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొర్లపాటివారిపాలెం వాసి. ప్రస్తుతం సీతమ్మదారలో ఇంటీరియర్ డిజైన్ షాపు ఉంది. కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు , పత్తి దుర్గా స్వామినాయుడు స్నేహితులు. ఇద్దరూ కలిసి మంగళవారం సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి ఇద్దరూ కూడా ప్రాణాలు వదిలారు. దీంతో కొర్లపాటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక మృతుల కుటంబాలు కేజీహెచ్ దగ్గర ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తు్న్నారు. లేదంటే పోస్ట్‌మార్టాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేపట్టారు.
ఇది కూడా చదవండి: Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్
మృతులు వివరాలు ఇవే:
1. పత్తి దుర్గా స్వామి నాయుడు (29),
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
2. కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (28).
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
3. ఎడ్ల వెంకటరావు (60)
అడవివరం, విశాఖ
4 . పిల్లా మహేశ్ (30),
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
5. పిల్లా శైలజ (29)
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
6. పైలా వెంకట రత్నం
ఇసుక తోట, విశాఖ
7. గుజ్జార మహాలక్ష్మి (65)
ఇసుక తోట, విశాఖ.
గాయపడిన వారి వివరాలు:
పైలా ప్రవీణ్ కుమార్
బాలాజీ నగర్,ఆరిలోవ, విశాఖ