విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఎంత మంది ఓదార్చినా.. ఎవరి తరం కావడం లేదు. అంతగా కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మృతులు మధురవాడలోని చంద్రంపాలెంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మహేశ్వరరావు( 30), భార్య శైలజ (29)గా గుర్తించారు. అప్పన్న దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడ్డారు. ఉన్నట్టుండి.. హఠాత్తుగా వారిపై గోడ కూలింది. అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరణవార్త తెలిసి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు తరలివచ్చారు. ప్రస్తుతం కేజీహెచ్ దగ్గర విలపిస్తున్నారు. మూడేళ్ల క్రితమే ఇద్దరికీ పెళ్లైందని.. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందంటూ రోదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ జిల్లా సింహాచలంలో భారీ వర్షం కురిసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Suicide : పెళ్లి నిశ్చితార్థం ముందు స్నేహితుడి హత్య చూసి జీవితాన్ని విడిచిన యువకుడు
