జ్ఞాన్వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది.
ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికేట్‌పై నమోదైన కేసులో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Ram Mandir: అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవనానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నెల 22న శ్రీరామమందిర ప్రతిష్టాపన జరగనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7000 మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపబడుతున్నాయి. ఈ ఆహ్వాన పత్రికలను కూడా స్పెషల్‌గా డిజైన్ చేశారు. ప్రతీ ఆహ్వన పత్రికపై శ్రీరాముడి చిత్రంతో పాటు రామమందిర ఉద్యమానికి సంబంధించి ముఖ్య సంఘటనలకు సంబంధించిన వివరాలతో కూడిన బుక్ లెట్ ఉంది. ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న వారి వివరాలు…
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు.
ఈ నెల 22న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీ రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఇటీవల కాలంలో ప్రేమ వ్యవహారాల్లో పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమిస్తుందని, తన మాట వినడం లేదని తల్లిదండ్రులు కూతుర్లను చంపేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కుమర్తె ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆమెను, ఆమె లవర్ని ఘోరంగా హత్య చేశాడు.
Bengaluru : బెంగళూరులోని ఓ బిల్డింగ్ 33వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు తన స్నేహితుడి ఫ్లాట్‌పై నుంచి కింద పడిపోయాడు.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, పరిగెత్తేలా చేసి కొట్టారు. అంతేకాకుండా.. గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది. ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.