ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుందని పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో ఐదు ఎయిర్ పోర్టులను ప్రారంభిస్తామని ప్రకటించారు. జామ్‌ఘర్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకోట్‌లో ఎయిర్ పోర్టుల నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
Read Also: Konathala Ramakrishna: జనసేన వైపు మాజీ మంత్రి చూపు..! త్వరలో పవన్ కల్యాణ్ భేటీ..!
ఇక, 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లో కేవలం ఆరు ఎయిర్ పోర్టులు మాత్రమే ఉండేవని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. అయోధ్య విమానాశ్రయంతో కలిపి 10కి చేరాయన్నారు. కేవలం నెల రోజుల్లో మరో 5 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి జీవార్‌లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి సింధియా వెల్లడించారు.
Read Also: Pragya Jaiswal: గులాబీ కలర్‌లో గుబాళిస్తున్న ప్రగ్యా జైస్వాల్
అయితే, ఇవాళ్టి నుంచి అయోధ్య- ఢిల్లీ మధ్య విమాన సేవలను ప్రారంభించిన ఇండిగో.. అలాగే, అయోధ్య టూ అహ్మదాబాద్ మధ్య వారానికి మూడుసార్లు విమానాలను నడపనుంది. జనవరి 15 నుంచి ముంబై-అయోధ్య మార్గంలో ఇండిగో మరిన్నీ సర్వీసులను నడపనుందని తెలిపారు. అయితే, ఈ నెల 22న జరగనున్న రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి అయోధ్య విమానాశ్రయంలో దాదాపు 100 చార్టర్డ్ ఫ్లైట్స్ రావొచ్చని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొ్న్నారు. అయోధ్యలోని శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తారనే అంచనాతో రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కనెక్టివిటీని కేంద్ర ప్రభుత్వ సహాయంతో మెరుగుపరిచిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.