Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకోరికి చెందిన బ్రిజేష్ మౌర్యను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని ప్రియురాలు సరిత, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకే నిందితుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు వద్ద వేలాడదీశాడు.
జనవరి 31న, సరిత చెరువు వద్ద ఉరివేసుకున్నట్లు కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రాథమిక విచారణలో నిందితుడు బ్రిజేష్ మౌర్యతో సరితకు సంబంధం ఉన్నట్లు తేలింది. మొదటి హత్య విషయాన్ని చెప్పేందుకు మౌర్య నిరాకరించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. సరితను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
తను పెళ్లి చేసుకోవాలని సరిత ఒత్తిడి చేస్తోందని, పెళ్లి చేసుకోకుంటే అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరిస్తోందని, తనను వదిలించుకోవడానికి హత్య చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. జనవరి 30వ తేదీ రాత్రి తనను కలవాలని సరితను మౌర్య కోరగా.. ఆమె మెడకు చున్నీని బిగించి హత్య చేసి, ఆ తర్వాత అక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు సమీపంలో ఉరివేసినట్లు వెల్లడించారు.