Republic Day Parade: పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించింది.. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటం అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. బహుమతిని సొందం చేసుకుంది.. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.. కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన శకటం పలువురిని ఆకట్టుకుందని తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాల శకటాలు పరేడ్ లో పాల్గొనగా పీపుల్స్ ఛాయిస్ విభాగంలో రాష్ట్ర విద్యాశాఖ శకటానికి ఈ అవార్డు లభించింది. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు రాగా.. మూడో బహుమతిని కైవసం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటం.