HIV positive: లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. జైలులో కొత్తగా 36 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. వీరందరు హెచ్ఐవీ పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు. దీంతో జైలులో మొత్తం 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ రోగ నిర్ధారణ జరిగింది.
Read Also: Ram Mandir: రామ మందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మణిశంకర్ అయ్యర్ కుమార్తెపై కేసు..
వ్యాధి సోకిన ఖైదీలకు కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఖైదీలకు హెచ్ఐవీ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి సోకిన వారికి ఆహార మార్పులను అనుమతించారు. అలాగే, పాజిటివ్‌గా తేలిన ఖైదీలందరినీ వైద్యుల పరిశీలనలో ఉంచారు. రోగులకు యాంటీ రెట్రో వైరల్ థెరపీ(ART) సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు ఖైదీల ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని జైలు సూపరింటెండెంట్ ఆశిష్ తివారీ చెప్పారు. తాజాగా తేలిన 36 కేసులకు ముందు 11 ఖైదీలకు హెచ్ఐవీ ఉంది.