‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అని ఓ కవి సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలను చూసి చలించిపోయి రాసిన పాట ఇది. అచ్చం అలాగే జరుగుతున్నాయి నేరాలు-ఘోరాలు. చిన్న చిన్న కారణాలకే మనుషుల ప్రాణాలు తీసేస్తు్న్నారు. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇందుకు లక్నోలో జరిగిన తాజా సంఘటనే ఉదాహరణ. ఓ చిన్న వివాదానికి ఓ కుటుంబాన్ని పొట్టనపెట్టుకుంది ఓ ముఠా. పైగా యోగీ సామ్రాజ్యంలో ఇలాంటి ఘోరాలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా మలిహాబాద్‌లో దారుణం జరిగింది. ఓ భూవివాదంలో కుటుంబాన్ని అత్యంత ఘోరంగా చంపేశారు. జీపులో ఇంట్లోకి దూసుకొచ్చిన కొందరు వ్యక్తులు దంపతులను, కుమారుడిని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపారు. అక్కడికక్కడే వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మునీర్ ఖాన్, అతని భార్య ఫర్హీన్, కుమారుడు హంజాలాగా గుర్తించారు.
చాలా కాలంగా భూవివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక ముఠా జీపులో ఇంట్లోకి వచ్చి తుపాకీతో కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డక్ అయ్యాయి. నిందితుడు లల్లన్ ఖాన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఇళ్లపై బుల్డోజర్లు ఉపయోగించే యోగీ సర్కార్.. తాజాగా జరిగిన ట్రిపుల్ మర్డర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
राजधानी लखनऊ ट्रिपल मर्डर लाइव.. pic.twitter.com/zQ73o5dAsN
— Suraj Shukla (@suraj_livee) February 2, 2024