ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని మరో మసీదు కూడా వివాదస్పదమైంది. జౌన్‌పూర్‌లోని ‘‘ అటాటా మసీదు’’ అంశం న్యాయస్థానంలో ఉంది. ఈ మసీదు హిందూ ఆలయమని కన్నౌజ్ రాజు విజయ్ చంద్ర ‘‘అటలా దేవి ఆలయం’’ నిర్మించారని హిందూ పక్షం చెబుతోంది. 14వ శతాబ్ధంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని,
Instagram Reels: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు.
నోయిడాలోని జెవార్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో తొలి విమాన టెస్టింగ్ విజయవంతంగా ముగిసింది. సోమవారం అధికారులు నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్‌గా ముగిసింది.
మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టక ముందే ఓ పసికందును చంపేశారు. ఆ పిండాన్ని టాయిలెట్ పైపులో పారేశారు. ఇంటి టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండాన్ని యజమాని వెలికి తీశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు పోలీసులు సమాచారం అందించారు.
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో ఇటీవల పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వేకి వచ్చిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడి చేసింది, కొందరు గన్ ఫైర్ చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Varanasi: వారణాసిలోని ఉదయ్ ప్రతాప్ కాలేజీ క్యాంపస్‌లో మసీదు వివాదానికి ఆజ్యం పోసింది. మసీదును తొలగించాలని పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డు యాజమాన్యం ఈ స్థలాన్ని క్లెయిమ్ చేసినట్లు నివేదికలు రావడంతో నిరసన ప్రదర్శన జరిగింది.
Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
Sambhal Violence: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనలకు ముందు ఈరోజు (డిసెంబర్ 6) సంభాల్‌లో డీఐజీ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో ఎస్పీ సహా ఇతర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ అల్లర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అయోధ్య, ఇప్పుడు సంభాల్, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు అన్ని చోట్లా ఉన్నారు.