Maha Kumbh Mela 2025: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ‘మహా కుంభమేళా’కు సిద్ధమవుతోంది. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అపురూప కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జరగబోయే ఈ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతారు. హిందూ మతంలో అతపెద్ద పండగల్లో కుంభమేళా ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం 2025 జనవరి 13న ‘‘పౌష్ పౌర్ణిమ’’ స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజుతో ముగుస్తుంది.
షాహి స్నాన్ ప్రాముఖ్యత:
ప్రపంచంలోనే అతిపెద్ద భక్తుల కలయికగా ఈ కుంభమేళా పరిగణించబడుతుంది. కొన్ని పవిత్ర రోజుల్లో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ‘‘షాహి స్నాన్’’తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాధువులు, హిందూమత గురువులు, ఆధ్యాత్మిక నాయకులు ఒకే చోట చేసిన పవిత్ర జలాల్లో స్నానమాచరిస్తారు. సాధువుల తర్వాత భక్తులు స్నానం చయడాన్ని విశేషంగా భావిస్తారు. సాధువుల ఉనికి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుందని భక్తుల నమ్మకం. త్రివేణి సంగమ పవిత్ర జలాల్లో స్నానం చేయడం పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిసత్తారు. ఈ స్నానం అనంతమైన జనన, మరణ చక్రం నుంచి విముక్తి కల్పిస్తుందని నమ్ముతారు.
షాహి స్నాన్ కోసం ప్రత్యేక తేదీలు:
మహా కుంభమేళాలో మొత్తం 06 స్నానాలు ఉంటాయి. మూడు రాజ స్థానాలు, మూడు ప్రధాన స్నానాలు ఉంటాయి. మొత్తం కుంభమేలాలో ప్రతీరోజూ స్నానం చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే, షాహి స్నాన్ రోజున మరింత పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
జనవరి 13, 2025: పౌష్ పూర్ణిమ
ఈ రోజు కుంభమేళా అధికారికంగా ప్రారంభమవుతుంది. పౌష్ పౌర్ణిమ కల్పవాస దీక్షను సూచిస్తుంది. ఇది మహా కుంభమేళా సమయంలో ఈ స్నానాన్ని భక్తులు చాలా విశ్వసిస్తారు.
జనవరి 14, 2025: మకర సంక్రాంతి (షాహి స్నాన్)
హిందూ క్యాలెండర్ అనుగుణంగా సూర్యుడు తన తదుపరి ఖగోళ స్థానానికి మారడాన్ని మకర సంక్రాంతి సూచిస్తుంది. సూర్యుడి ఉత్తరాయనం సంక్రాంతితో ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున మహా కుంభమేళాలో దాతృత్వ విరాళాలు ప్రారంభమవుతాయి.
జనవరి 29, 2025: మౌని అమావాస్య (షాహి స్నాన్)
మౌని అమావాస్య అనేది ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ పవిత్ర రోజున స్నానం, పవిత్ర కార్యానికి గ్రహాల స్థితిగతులు అత్యంత అనుకూలమని భావిస్తారు.
ఫిబ్రవరి 3, 2025: వసంత్ పంచమి (షాహి స్నాన్)
వసంత పంచమి రుతువుల పరివర్తనకు ప్రతీక. హిందూ పురాణాల్లోని సరస్వతి మాత ఆగమనాన్ని పండగగా జరుపుకుంటారు. భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేసి, పసుపురంగు వస్త్రాలు ధరిస్తారు.
ఫిబ్రవరి 12, 2025: మాఘి పూర్ణిమ
ఈ రోజు ఋషులు , సన్యాసుల నెల రోజుల దీక్ష ముగుస్తుంది. ఈ రోజు నదిలో పవిత్ర స్నానం చేయడం గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెస్తుందని భక్తులు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 26, 2025: మహాశివరాత్రి
మహా కుంభమేళా చివరి రోజు శివరాత్రితో ముగుస్తుంది. ఈ రోజు స్నానమాచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.