Suryakumar Yadav: “ఫీల్డింగ్ కోచ్‌దే అసలైన క్రెడిట్”.. థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. కేవలం ఏడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు దేశాలకు చెందిన కోట్లాది మంది అభిమానులు టీవీలు, ఫోన్లకు అతుక్కు పోయారు. చివరి వరకు మ్యాచ్‌ను వీక్షించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో మాత్రం భారత్ పూర్తిగా ఆధిపత్యం చాటింది. హార్దిక్ పాండ్యా కీలక సమయంలో ఫిల్ సాల్ట్ వికెట్ తీసి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. తర్వాత అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ పట్టి హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి జోస్ బట్లర్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్ ఆశలకు మరో దెబ్బ కొట్టాడు. దీంతో కొంతసేపు మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వెళ్లినట్లే కనిపించింది.
READ MORE: Vrushakarma : ‘వృషకర్మ’ గ్లింప్స్‌లో విలన్ హైలైట్‌పై నాగచైతన్య క్లారిటీ
Also Read
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంతో సంతోషం వ్యక్త చేశాడు. సొంత దేశంలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరడం ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చిందన్నాడు. అహ్మదాబాద్‌లో జరిగే తుది పోరుకు వెళ్లడం ఎంతో ఆసక్తికరంగా ఉందన్నాడు. సంజూ శామ్సన్‌ను పొగడ్తలతో ముంచేత్తాడు. సంజూ క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే తన లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసుకున్నాడని.. వికెట్లు పడినప్పటికీ.. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడాడని గుర్తు చేశాడు. గతేడాది నుంచి ఎంతో కష్టపడి సాధన చేసిన సంజూకు ఇది మంచి ఫలితమని, జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు.
READ MORE:Iran-Gulf War: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
ఇంగ్లాండ్ లక్ష్య ఛేదన గురించి కూడా సూర్యకుమార్ మాట్లాడాడు. “ఇంత పెద్ద స్కోరు చేసిన తర్వాత కూడా మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వారి పోరాటాన్ని తగ్గించి చెప్పలేం. అయితే జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు కీలక సమయంలో మ్యాచ్‌ను తిరిగి భారత్ వైపు మళ్లించారు. అంతేకాదు.. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చేసిన శ్రమ ఫలితమే మైదానంలో కనిపిస్తోంది. సాధన సమయంలో ఆటగాళ్లతో సరదాగా, పోటాపోటీగా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించడం వల్లే ఆటగాళ్లు మరింత చురుకుగా మారారు. నేను క్యాచ్ పట్టే సమయంలో చాలా ఉత్కంఠగా అనిపించింది. నా గుండె వేగంగా కొట్టుకుంది. అయితే ఇలాంటి ఒత్తిడి పెద్ద మ్యాచ్‌లలో సహజం.” అని కెప్టెన్ తెలిపాడు. మైదానంలో అభిమానుల మద్దతు జట్టుకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చిందని సూర్యకుమార్ వివరించాడు. వార్మప్ సమయంలోనే స్టేడియం దాదాపు నిండిపోయిందని, అభిమానులు భారత్ విజయం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అప్పుడు అర్థమైందని అన్నాడు. తాము ఆ అభిమానులకు మంచి ఆట చూపించామని ఆశిస్తున్నానని తెలిపాడు.
తాజావార్తలు
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!