Vijay-Trisha: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్
- పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి
- ఒకే కారులో వివాహ రిసెప్షన్‌కు వచ్చిన జంట
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో హీరో విజయ్-త్రిష సందడి చేశారు. విజయ్ భార్య సంగీత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన తర్వాత విజయ్-త్రిష జంట ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితం వారల్లో నిలిచింది. ఓ నటితో విజయ్ ఉంటున్నాడని బీజేపీ నేత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పారు. అంతలోనే విజయ్ భార్య సంగీత కూడా బాంబ్ పేల్చింది. తన భర్త ఒక నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 2025 డిసెంబర్‌లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. భార్య ఆరోపణలతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో ఉంది. తదుపరి విచారణ ఏప్రిల్ 20న జరిగే అవకాశముంది.
Also Read
ఇలాంటి తరుణంలో విజయ్-త్రిష కలిసి ఒకే కారులో వచ్చి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే విజయ్-త్రిష కలిసి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి కళ్లు ఆ జంటపైనే ఫోకస్ అయ్యాయి. మీడియా కూడా ప్రధానంగా హైలెట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
విజయ్-త్రిష గతంలో ‘‘ఘిల్లి’’, ‘‘తిరుపాచి’’, ‘‘లియో’’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎప్పుడు ఇద్దరూ బయటపడలేదు. తాజాగా విజయ్ భార్య ఆరోపణల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా కలిసి పెళ్లికి హాజరుకావడంతో బంధంపై క్లారిటీ వచ్చినట్లేనని చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
-
AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!