నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని అందులో కోరారు. కాగా, షాహీ జామా మసీదు కమిటీ వేసిన పిల్ ను ఈరోజు (నవంబర్ 29) సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. దీనితో పాటు.. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి రాజా సింగ్ చేరుకున్నారు. మహాకాళ్ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని బాబా మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.
Sambhal violence: సంభాల్ హింసకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆడియో క్లిప్‌లో ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లోని జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు.
Doctors Died In Road Accident: ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా, వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు, ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కన్నౌజ్‌లోని తిర్వా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ బర్వాలా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పరిస్థితి విషమంగా మారింది. అయితే.. అందరూ తోపుడు బండిపై విక్రయిస్తున్న కాల్చిన వేరుశనగ పప్పులు కొని తిన్నారని, ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు.
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నగరంలో అట్టుడుకుతోంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులపై అక్కడి స్థానికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరపాల్సి వచ్చింది.
Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో పోలీసులు 400 మందిపై కేసు ఫైల్ చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తో పాటు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కొడుకు సోహైల్ కూడా ఉన్నారు.
Sambal Conflict: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్‌లో గల జామా మసీదు సర్వే పనుల్లో నెలకొన్న హింసపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనలో యూపీ సర్కార్ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Sambhal Violence: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన సంభల్‌లో కోర్టు ఆదేశాల మేరకు ఓ మసీదులో సర్వే చేస్తుండగా ఆదివారం ఉదయం చెలరేగిన అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
GPS: ఇటీవల కాలంలో జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ నమ్మి కొన్ని సార్లు ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు వాహనదారులు. కొన్ని సందర్భాల్లతో తప్పుడు రూట్లలోకి తీసుకెళ్లడం మూలంగా కొందరు ప్రయాణికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.