ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. అందులో.. టాప్-5లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి..? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..
ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య ఐదేళ్లలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. దీంతో పాటు.. దేశంలోని ఏయే రాష్ట్రాల్లో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందించింది. సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా మొత్తం 3639617 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈవీలు అమ్మకాల పరంగా అత్యధిక నమోదు అయిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య ఉత్తరప్రదేశ్‌లో 665247 యూనిట్ల ఈవీలు అమ్మకం జరిగాయి. ఆ తర్వాత 439358 యూనిట్ల ఈవీలు అమ్మకాలు జరిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో కర్ణాటకలో 350810 యూనిట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 228850 యూనిట్లు నమోదయ్యాయి. 233503 యూనిట్ల నమోదుతో రాజస్థాన్ టాప్-5 జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అలాగే.. ఢిల్లీ ఏడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో మొత్తం 216084 యూనిట్లు నమోదయ్యాయి.
Read Also: Minister Ponguleti: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమే!
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ MORTH పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2019-2024 మధ్య సిక్కింలో ఒక్క ఎలక్ట్రిక్ వాహనం కూడా అమ్ముడు కాలేదు. అలాగే.. లక్షద్వీప్‌లో 19, నాగాలాండ్‌లో 27, అరుణాచల్ ప్రదేశ్‌లో 42, లడఖ్‌లో 88, అండమాన్ మరియు నికోబార్‌లో 191, దాదర్ నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలో 468, మిజోరాంలో 344, మేఘాలయలో 572, మణిపూర్‌లో 12304, హిమాచల్ ప్రదేశ్ , పుదుచ్చేరిలో 5933 యూనిట్ల రిజిస్ట్రేషన్ జరిగింది.