Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ అల్లర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అయోధ్య, ఇప్పుడు సంభాల్, బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు అన్ని చోట్లా ఉన్నారు.
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే వివాదం తీవ్ర హింసకు కారణమైంది. రాళ్లదాడి, గృహాల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించిన గుంపు హింసాత్మకంగా ప్రవర్తించింది. ఈ హింసాత్మక దాడుల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఇదిలా ఉంటే,
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల హింస చెలరేగిన సంభాల్‌కి రేపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ బృందంతో రాహుల్ గాంధీ ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. నవంబర్ 24న యూపీలోని సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో వేల సంఖ్యలో గుంపు అధికారులు, పోలీసులపై రాళ్ల దాడి చేసింది. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు.…
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తన ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడిందనే కారణంతో ఓ భర్త తన భార్యను, అత్తను హత్య చేశాడు. ఆదివారం రాత్రి భర్త ఇంటికి రాగా, భార్య ప్రేమికుడితో మాట్లాడుతూ కనిపించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ దాకా వెళ్లింది. ఇంతలో భార్య తల్లి అడ్డుకోవడంతో ఆగ్రహించిన భర్త పదునైన ఆయుధంతో ఇద్దరినీ నరికి చంపాడు. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలో 14 ఏళ్ల బాలుడు నడుస్తున్న సమయంలో గుండె పోటుతో మణించాడు. మోహిత్ చౌదరి అనే బాలుడు తన పాఠశాలలో క్రీడా పోటీల కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సిరౌలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Geyser Explodes: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. గీజర్ పేలి నవ వధువు మరణించింది. బరేలీలోని మీర్గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బులంద్ షహర్‌లోని కాలే కా నాగ్లా గ్రామానికి చెందిన యువతి పిపల్సనా చౌదరి గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో బాధిత యువతికి ఐదు రోజుల క్రితమే వివాహం జరిగింది. బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
Fire Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 బైక్స్ కాలి బూడిదయ్యాయి. ఈ రోజు (నవంబర్ 30) తెల్లవారుజామున ఈ ఘటన నెలకొంది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఓ శిశువు నాలుగు కాళ్లు, వెన్నెముక పైభాగంలో భారీ వాపుతో జన్మించింది. తమ బిడ్డకు వికృతమైన పరిస్థితి దాపురించడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారు. మగ బిడ్డను 6 మార్చి 2024న రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ పీడియాట్రిక్ సర్జరీ ఓపీడీలో అడ్మిట్ చేశారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొ. సత్యశ్రీ చిన్నారికి రెండు కాళ్లు మామూలుగానే ఉన్నాయని గుర్తించారు. మిగతా రెండు కాళ్లు అసాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపారు. అంతే…