Two brothers died due to snake bite in UP:ఎప్పుడు ఎలా మృత్యువు వస్తుందో ఎవరం చెప్పలేము. ఒకరి అంత్యక్రియలకు హాజరై మరొకరు చనిపోయిన ఘటనలను మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అయితే అన్న అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా అన్నలాగే మరణించడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. పాము కాటులో మరణించిన అన్న అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా పాము కాటుకే గురై మరణించిన ఘటన…
కొన్ని సార్లు ఊహించన ఘటనలు మనిషిని అతలాకుతలం చేస్తాయి.. ఉత్తరప్రదేశ్లో ఓ దినసరి కూలీకి అలాంటి ఘటనే ఎదురైంది… ఏటీఎంకు వెళ్లిన రూ.100 డ్రా చేసిన ఆ కార్మికుడికి.. మీ ఖాతాలో రూ.2,700 కోట్లు ఉన్నట్టు మెసేజ్ రావడంతో షాక్ తిన్నాడు.. తీరా బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే అసలు విషయం తెలిసి నిరుత్సాహానికి గురయ్యాడు.. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: Rahul Gandhi: “రాహుల్ గాంధీ ప్రధాని…
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను మాదాపూర్ ఎస్వోటి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గచ్చిబౌలి సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 11 మంది అరెస్ట్ చేసామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు కోట కిషోర్ కుమార్ తో పాటు 10 మందిని అదుపులో తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు 18 యూనివర్సిటీ లకు…
డీజిల్ దొంగతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ కాల్చి చంపబడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి-24పై ఆగి ఉన్న ట్రక్కు నుండి దొంగలు డీజిల్ను దొంగిలిస్తుండగా.. ఆపడానికి ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ ప్రయత్నించాడు. దీంతో తమ వద్ద ఉన్న గన్తో దొంగలు అతనిని పట్టపగలే కాల్చి చంపేశారు.
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఈ ఘటన పోఖారీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగింది.
మానవత్వం నసిస్తోంది. అనుమానం పెనుభూతంలా మారుతోంది. అనుమానంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడటంలేదు. ఏంజరుగుతుంది అనుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. ఒకరు వేధిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరి కొందరు ఎదుటివారిపై అనుమానంతో వారి ప్రాణాలు తీసేందుకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా యూపీ మారింది. వరుస ఘటనలతో యూపీ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వితంతువు అయిన తన కోడలిని సుత్తితో…
అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) అగ్నివీరుల ఎగ్జామ్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ1, బీ1, సీ1 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు పరీక్ష ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కాగా.. రెండో షిఫ్టు 11.30 గంటలకు మూడో షిఫ్టు మధ్యాహ్నం 3.15 గంటలకు నిర్వహించనున్నారు. జూలై 24 నుంచి జూలై 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.
Panipuri Challenge in uttar pradesh: పానీపూరీ పేరు చెప్పగానే కొందరికి నోట్లో నీళ్లూరుతాయి. ప్రతిరోజూ సాయంత్రం పానీపూరి బండి దగ్గరకు వెళ్లి ఒక ప్లేట్ పానీపూరీ లాగించకపోతే కొందరికి ఏం తిన్నా రుచించదు. కరోనా లాక్డౌన్ సమయంలోనూ పానీపూరీ బండ్లు పెట్టలేదని ఏకంగా ఇళ్లల్లోనే పానీపూరీలు చేసుకుని మరీ లాగించేశారు మన పానీపూరీ ప్రియులు. ఈ రేంజ్లో పానీపూరీ లవర్స్ ఉంటే.. ఎవరైనా పానీపూరీ ఛాలెంజ్ అంటే ఎగబడకుండా ఉండగలరా?. అయినా ఓ వ్యక్తి బస్తీమే…
Asaduddin Owaisi's comments on PM Narendra Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర నేపథ్యంలో యాత్ర మార్గంలో మాంసం దుకాణాలు మూసివేయడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కన్వర్ యాత్రంలో భాగంగా యాత్ర మార్గంలోని మాంసం దుకాణాలను జూలై 18 నుంచి జూలై 27 వరకు మూసివేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై అసదుద్దీన్ విరుచుకుపడ్డారు.