Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..
- టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్.. ఫైనల్‌కు చేరిన టీమిండియా
- 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ విజయం
- స్కోర్లు: భారత్-253/7.. ఇంగ్లండ్-246/7
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (25), సాల్ట్ (5) త్వరగానే అవుట్ అయినప్పటికీ, యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ (105) వీరోచిత సెంచరీతో భారత్‌ను వణికించాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ బాదిన బెథెల్, విల్ జాక్స్‌తో కలిసి 77 పరుగులు, శామ్ కరన్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పి ఇంగ్లండ్‌ను విజయం అంచులకు తీసుకెళ్లాడు.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!
కానీ.. మ్యాచ్ ఉత్కంఠగా మారుతున్న సమయంలో భారత ఫీల్డింగ్, ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్‌లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్లి అక్షర్ అందుకోవడం హైలైట్‌గా నిలిచింది. అలాగే విల్ జాక్స్ అవుట్ అయిన సమయంలో అక్షర్, దూబేలు కలిసి చేసిన రిలే క్యాచ్ స్టేడియంను హోరెత్తించింది.
చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా, సూర్యకుమార్ యాదవ్ బంతిని శివమ్ దూబే చేతికి ఇచ్చాడు. మొదటి బంతికే ప్రమాదకరంగా మారిన బెతెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ 246/7 పరుగులకు పరిమితమైంది.
హార్దిక్ పాండ్యా కీలక సమయంలో శామ్ కరన్ వికెట్ తీయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వేగాన్ని అడ్డుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులు ఇచ్చి హ్యారీ బ్రూక్ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ విల్ జాక్స్ వికెట్ తీసి కీలక బ్రేక్ ఇచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్, సమయస్ఫూర్తితో కూడిన బౌలింగ్‌తో టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు అందరి కళ్లు న్యూజిలాండ్‌తో జరగబోయే గ్రాండ్ ఫైనల్‌పైనే ఉన్నాయి.
Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..