అల్ ఖైదా ఉగ్రవాది.. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ తెలియని వారుండరు. అమెరికా దశాబ్ధకాలం పాటు వెటాడి వెంటాడి పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో హతమార్చింది. ఇదిలా ఉంటే ఓ ప్రభుత్వ అధికారి తన కార్యాలయంలో ఏకంగా ఒసామా బిన్ లాడెన్ ఫోటోను పెట్టుకుని దాని కింద ‘‘ప్రపంచపు అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్’’గా అభివర్ణిస్తూ ఫోటో పెట్టాడు. ఇది ఎక్కడో పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో కాదు మన భారత్ లో…
ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్‌పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు. 2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్…
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో మతకలహాలు, అల్లర్లకు చోటు లేదని ఆయన అన్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అల్లర్ల రహిత ఉత్తర్ ప్రదేశ్ గా మారిందని ఆయన అన్నారు. యూపీలో కొత్త ప్రభుత్వం తన కార్యక్రమాలను మొదలుపెట్టిందని.. రెండు నెలలుగా మీరంతా యూపీలో జరుగుతున్న కార్యక్రమాలను చూస్తున్నారని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రామ జన్మభూమి భూమి నిర్మాణం శాంతిపూర్వకంగా మొదలైందని ఆయన అన్నారు. హనుమాన్ జయంతి…
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయోధ్యకు వెళ్తున్న క్రమంలో బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 7 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం మోతీపూర్ ప్రాంతంలో జరిగింది. కర్ణాటకకు చెందిన 16 మంది టూరిస్టులు అయోధ్యను వెళ్తుండగా ఎదురగా వస్తున్న ట్రక్కు, బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 16 మందిలో ఏడుగురు చనిపోతే అందులో ముగ్గరు మహిళలు ఉన్నారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కూడా కొంతమంది పరిస్థితి…
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం, పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతారణాన్ని కల్పించేందుకు యోగీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో నైట్ షిఫ్ట్ లో మహిళలు ఎవరూ పని చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా కార్మికులను పని చేయించుకోవద్దని ఆదేశించింది. మహిళల సొంత అనుమతితోనే పని చేసేలా ప్రభుత్వ సర్క్యులర్ ని…
పింపుల్స్.. యువతులకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఈ మొటిమలు తమ ముఖాన్ని అందవిహీనంగా తయారు చేస్తాయి కాబట్టి.. వీటి విషయంలో అమ్మాయిలు చాలా సీరియస్‌గా ఉంటారు. కొందరైతే, ఒక్క చిన్న మొటిమ వచ్చినా ఇంటి నుంచి బయటకు రారు. అయితే.. ఓ అమ్మాయికి ఎన్ని చికిత్సలు చేయించినా మొటిమలు పోకపోవడం, వాటి వల్ల పెళ్ళి కూడా అవ్వకపోవడంతో.. బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బిసంద పోలీస్…
దేశంలో ఓ వైపు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతోంది. జ్ఞానవాపి మసీదు ఒకప్పుడు హిందూ దేవాలయం అని తమకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్ వేయడంతో వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశించింది. తాజాగా దీనిపై అంజుమన్ ఇంతేజామియా సుప్రీంలో పిటిషన్ వేయగా.. శుక్రవారం సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వారణాసి జిల్లా కోర్ట్ కు కేసును బదిలీ చేసింది. వీడియో సర్వేలో దొరికిన శివలింగాన్ని రక్షించాలని… ఆదే…
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. గతంలో పలు పట్టణాలు, నగరాల పేర్లు మార్చిన విధంగానే రాజధాని లక్నో పేరును కూడా మార్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా యోగీ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సోమవారం సాయంత్రం లక్నోకు వచ్చిన ప్రధాని నరేంద్ మోదీని స్వాగతిస్తూ…‘‘ శేషావతారి భగవాన్ లక్ష్మణుడి పావన నగరమైన లక్నో మోదీకి స్వాగతం పలుకుతుంది’’…
రైతుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసి.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేసిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)లో చీలిక వచ్చింది. ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన రాకేష్ టికాయత్ వైఖరి నచ్చని రైతు నాయకులు కొత్త సంఘం పెట్టుకున్నారు. రాజేష్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ అరాజనీతిక్ పేరుతో కొత్త సంఘంగా ఆవిర్భవించింది. రాజకీయాలకు వ్యతిరేకంగా రైతు సంక్షేమం కోసం పోరాటం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు రాజేష్ సింగ్ చౌహాన్. ఢిల్లీ రైతు…
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్ కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా…