UP Man unfurls Pakistani flag, arrested: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15 వరకు ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగరేయాలని కోరారు. ఇందుకు తగ్గట్లుగానే దేశ ప్రజలు తమతమ ఇళ్లపై భారత జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది.…
Lawyer Fight For Justice: డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి… రూపాయి ఉచితంగా వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. మరి మన డబ్బులు మనం సాధించుకోవడంలో పోరాటం చేస్తే తప్పేముంది. ఓ న్యాయవాది కూడా ఇలాగే ఆలోచించాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగనాథ్ చతుర్వేది అనే లాయర్ 1999లో ఉత్తరప్రదేశ్లోని మధుర కంటోన్మెంట్ స్టేషన్లో తనతో పాటు మరో వ్యక్తి కోసం రూ.70కి రెండు రైలు టికెట్లు కొన్నాడు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.35. అయితే చతుర్వేది రూ.100…
ఉచిత పథకాల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారు..? ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేస్తున్నదేంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. దీనిని.. Yogi oppose Modi హాష్ ట్యాగ్ జోడిస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే, ఉచిత సంక్షేమ పథకాల వల్ల అభివృద్ది జరగదు అని ప్రధాని చెబుతూ వస్తున్నారు.. ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించిన ప్రధాని.. ఉచితాలు దేశాభివృద్ధిని…
Constable Crying: యూపీలోని ఫిరోజాబాద్లో ఓ కానిస్టేబుల్ చేతిలో భోజనం పళ్లెం పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా ఆకలితో ఉన్నానని, అధికారులు పట్టించుకోవట్లేదని అతడు వాపోయాడు. జంతువులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినలేవని, అలాంటి రొట్టెలు తమకు ఇస్తున్నారని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంటికి దూరంగా…
ISIS Planning Terror Attack On August 15: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ కుట్ర చేసింది. అయితే ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
BJP worker arrested by yogi government: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఓ మహిళపై బీజేపీ నేత దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో యోగీ సర్కార్ బుల్డోజర్లతో యాక్షన్ మొదలు పెట్టింది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన సొంత పార్టీ నేతపైనే చర్యలు తీసుకుంది. నోయిడాలోని సెక్టార్ 93 బిలోని గ్రాండ్ ఓమాక్స్ హౌజింగ్ సొసైటీలోని బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణ…
Free Bus Ride For Women: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే నేరస్తులకు, మాఫియాకు ఎంతటి భయమో అందరికి తెలుసు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితుల ఇంటి ముందుకు బుల్డోజర్లు క్యూ కడుతాయి. శాంతి భద్రతల విషయంలో యోగి ఎంత నిక్కచ్చిగా ఉంటారో.. సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... రెండో సారి యూపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.
Death Threat To UP CM,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరికలు చేశారు. ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.
Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా…
Father Try to Kill Own Daughter in Uttar Pradesh: లవ్ ఎఫైర్ పెట్టుకుందని సొంత కూతురినే తుదముట్టించేందుకు ప్రయత్నించాడో తండ్రి. కాంట్రాక్ట్ కిల్లర్ కు సుపారీ ఇచ్చి కూతురును హత్య చేయించేలా పథకం వేశాడు. అయితే చివరకు తండ్రితో పాటు కాంట్రాక్ట్ కిల్లర్ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల మాట కాదని ఓ వ్యక్తిని ప్రేమిస్తూ.. అతనితో సంబంధం నెరుపుతోంది. అయితే తండ్రితో…