AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ త్వరలో ప్రమోషన్లు..
- సచివాలయాల పేర్లను ‘స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు’గా మారుస్తూ బిల్లు ఆమోదం..
- సేవల జాప్యం తగ్గించేందుకు మూడంచెల వ్యవస్థ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ , వార్డు సచివాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కూటమి సర్కార్ ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ.. ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ‘గ్రామ, వార్డు సచివాలయాల’ పేరును ‘స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనమండలి తాజాగా ఆమోదం తెలిపింది.
సచివాలయ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఒకే హోదాలో నిలిచిపోయిన వేలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం కెరీర్ పరంగా పెద్ద ఊరటనివ్వనుంది.
Also Read
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
Also Read:Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..
ప్రజలకు అందే సేవల్లో జాప్యం తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మూడంచెల (Three-tier) పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరంతర నిఘా ఉంటుంది. గతంలో పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లాయని, ఇప్పుడు ఆ నిధులను నేరుగా పంచాయతీలకే కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
సచివాలయాలను కేవలం రాజకీయ కేంద్రాలుగా కాకుండా, ప్రజల అవసరాలు తీర్చే నిజమైన సేవా కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ‘స్వర్ణాంధ్ర’గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగానే ఈ సంస్థాగత మార్పులు జరుగుతున్నాయి.
గతంలో వాలంటీర్ల ద్వారా జరిగిన పెన్షన్ల పంపిణీని.. ప్రస్తుతం ప్రజాప్రతినిధులే నేరుగా లబ్ధిదారులకు అందించడం ద్వారా వ్యవస్థలో మరింత పారదర్శకత వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. అవినీతి రహిత పాలనను అందిస్తూ.. ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ఈ ‘స్వర్ణ’ విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ మార్పులు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో పాలనా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా తయారు చేయనున్నాయి.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!